అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mandula Samuel Warning | ఉమ్మడి నల్గొండ (Nalgonda) జిల్లా కాంగ్రెస్‌లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. తుంగతుర్తి ఎమ్మెల్యే (Tungaturti MLA) మందుల సామేల్ కోమటిరెడ్డి సోదరులకు వార్నింగ్ ఇచ్చారు. తన నియోజకవర్గం జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటీవల భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అనుచరులు మధ్య పెద్ద వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఎంపీ అనుచరులపై ఎమ్మెల్యే వర్గం వారు దాడి చేశారు. ఆ వివాదం సద్దుమణగకముందే ఎమ్మెల్యే సామేల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఏకంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి లక్ష్యంగా విమర్శలు చేశారు.
Mandula Samuel Warning | చిన్న చూపు చూస్తున్నారు
మంత్రి కోమటిరెడ్డికి (Minister Komatireddy) తుంగతుర్తికి ఎమ్మెల్యే ఉన్నాడని విషయం తెలియట్లేదని సామేల్ ఆరోపించారు. వెంకటరెడ్డికి ఎస్సీ నియోజకవర్గమంటే చిన్న చూపు అన్నారు. నల్గొండ జిల్లా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డిల రాజ్యం అనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు తమగురించి హీనంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారి దగ్గర చేతులు చాచి తాము గెలవలేదన్నారు.
Mandula Samuel Warning | మునుగోడులో చూసుకో..
రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాలు బాగాలేవు అని అంటున్నారని మందుల సామేల్ అన్నారు. ‘‘ముందు మునుగోడులో నీది నువ్వు చూసుకో” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో అభివృద్ధి జరగలేదు, పరిస్థితి బాగాలేదని తనకు కూడా రిపోర్ట్ వచ్చిందన్నారు. తన నియోజకవర్గంలో మండలాధ్యక్షులను నియమిస్తే అడ్డుకునే హక్కు రాజగోపాల్‌రెడ్డికి ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి పోయి, రాహుల్ గాంధీని తిట్టి, ఎన్నికలప్పుడు మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చారన్నారు. అలాంటి వ్యక్తి తమ గురించి మాట్లాడటంపై మండిపడ్డారు.
Mandula Samuel Warning | మంత్రి పదవి వారికి ఇవ్వాలి
రాష్ట్రంలో మిలిగిన రెండు మంత్రి పదవుల విషయంలో మందుల సామేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకటి లంబాడా ఎమ్మెల్యేకు, ఇంకోటి యాదవ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు ఇవ్వాలన్నారు. కాగా మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఇవ్వకూడదని పరోక్షంగా ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు. ఎస్టీల నుంచి గిరిజన ఎమ్మెల్యే సీతక్కకు మంత్రి పదవి ఇచ్చారని, అదేవిధంగా లంబాడాలకు ఒక పదవి ఇవ్వాలని ఆయన కోరారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వొద్దు
మిగిలిన రెండు మంత్రి పదవుల్లో ఒకటి లంబాడా ఎమ్మెల్యేకు, ఇంకోటి యాదవ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు ఇవ్వాలి
కోమటిరెడ్డి బ్రదర్స్‌పై రాహుల్ గాంధీకి, ఖర్గేకు ఫిర్యాదు చేస్తా
నా నియోజకవర్గంలో కోమటిరెడ్డి బ్రదర్స్ జోక్యం… pic.twitter.com/PTiuD0oNnG
— News Line Telugu (@NewsLineTelugu) July 24, 2026
దీనిని కూడా చదవండి : BHAVYA Rasayan Scheme | భవ్య రసాయన్ పథకానికి ఆమోదం.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు