BHAVYA Rasayan Scheme | భవ్య రసాయన్‌ పథకానికి ఆమోదం.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భవ్య రసాయన్‌ పథకానికి ఆమోదం తెలిపింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BHAVYA Rasayan Scheme |కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బళ్లారి-గుంతకల్లు మధ్య అదనంగా రెండు రైల్వే లైన్లకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. భవ్య రసాయన్‌ పథకానికి ఆమోదం తెలిపింది.

ప్రధాని మోదీ (PM Modi) అధ్యక్షతన శుక్రవారం మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్​లో చర్చించిన అంశాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్​ (Ashwini Vaishnav) మీడియాకు వెల్లడించారు. పేపర్​ లీకేజీలపై కఠిన శిక్షల బిల్లుకు కేబినెట్​ ఆమోదం తెలిపింది. దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేయడం, పెట్టుబడులను ఆకర్షించడం, రసాయన పరిశ్రమ పోటీతత్వాన్ని పెంచడం లక్ష్యంగా దేశవ్యాప్తంగా మూడు ప్రత్యేక రసాయన పార్కులను ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ‘భారత్ పారిశ్రామిక వికాస్ యోజన రసాయన్’ (BHAVYA Rasayan) పథకానికి ఆమోదం తెలిపింది.

BHAVYA Rasayan Scheme |రూ.3,030 కోట్లతో..

ఈ పథకానికి మొత్తం రూ. 3,030 కోట్ల వ్యయం అవుతుంది. పార్కుల లోపల ఉమ్మడి మౌలిక సదుపాయాలు, ప్రాథమిక వసతుల కల్పనకు రూ. 3,000 కోట్లు, అలాగే పరిపాలనాపరమైన ఖర్చుల కోసం రూ. 30 కోట్లు కేటాయించారు. కెమికల్ పార్కుల కోసం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు వాటా సమకూర్చుకోవాలి. కేంద్రం ఒక్కో పార్కుకు రూ.వెయ్యి కోట్లు అందిస్తుంది. ఒక్కో పార్కు 2 వేల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తామని తెలిపింది.

BHAVYA Rasayan Scheme |అదనపు రైల్వే మార్గం కోసం..

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోని బళ్లారి – గుంతకల్లు విభాగంలో మూడో, నాలుగో రైలు మార్గాల నిర్మాణానికి రూ. 1,264 కోట్ల వ్యయంతో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా భారతీయ రైల్వే నెట్‌వర్క్ సుమారు 46 కిలోమీటర్ల మేర విస్తరించనుంది. దీంతో అదనంగా 16 మిలియన్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యం సమకూరడమే కాకుండా, ఏటా రూ. 149 కోట్ల లాజిస్టిక్స్ వ్యయం కూడా ఆదా అవుతుంది.

దీనిని కూడా చదవండి : KTR NEET Protest | మోదీ జాగ్రత్తగా ఉండు.. కేటీఆర్​ కీలక వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *