Bangladesh President Resigns | బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్‌ షాబుద్దీన్‌ రాజీనామా

బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్‌ షాబుద్దీన్‌ అనారోగ్య కారణాలరీత్యా తన పదవికి రాజీనామా చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Bangladesh President Resigns | బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్‌ షాబుద్దీన్‌ అనారోగ్య కారణాలరీత్యా తన పదవికి రాజీనామా చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మాజీ న్యాయవాది అయిన ఆయన, అవామీ లీగ్ పార్టీ తరఫున 2023 ఏప్రిల్‌లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం వాస్తవానికి 2028 ఏప్రిల్ వరకు ఉన్నప్పటికీ, ముందుగానే అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన నాటి నుంచే ఆయన రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు పలుమార్లు బహిరంగంగానే వెల్లడించారు.

Bangladesh President Resign | ఎన్నికలు జరిగిన అనంతరం ..

హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత ఏర్పడిన యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తనను అనేక ఇబ్బందులకు గురిచేసిందని షాబుద్దీన్ గతంలో పేర్కొన్నారు. దేశ తాత్కాలిక ప్రభుత్వం తనకు తగిన గౌరవం ఇవ్వట్లేదని, ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ ఎన్నికలు జరిగిన అనంతరం పదవికి రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు. అదే నెలలో బంగ్లాదేశ్‌ నూతన ప్రధానిగా తారిఖ్‌ రెహమాన్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే షాబుద్దీన్‌ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై బంగ్లాదేశ్‌ ప్రభుత్వం అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇది కూడా చదవండి:  Chandrababu School Visit | విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సీఎం చంద్రబాబు, నారా లోకేశ్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *