అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Police| కుటుంబ కలహాలతో బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించిన వ్యక్తిని కామారెడ్డి (Kamareddy) జిల్లా పోలీసులు సమయస్ఫూర్తితో కాపాడారు. ఈ ఘటన అడ్లూర్–ఎల్లారెడ్డి(Yellareddy) వంతెన వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది.
Kamareddy Police| అనుమానాస్పదంగా తిరుగుతుండగా..
సదాశివనగర్(Sadashivanagar) పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ అజర్ గురువారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా రాత్రి 9 గంటల సమయంలో అడ్లూర్–ఎల్లారెడ్డి బ్రిడ్జి వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా నిలబడి ఉండటాన్ని గమనించారు. వెంటనే అక్కడికి వెళ్లి విచారించగా అడ్లూర్ గ్రామానికి చెందిన పందిరి నాగరాజు అని, తండ్రి బాలయ్య అని తెలిసింది. కుటుంబ సమస్యలతో మనస్తాపం చెంది బ్రిడ్జిపై నుంచి దూకేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. కానిస్టేబుల్ అజర్ వెంటనే అతడికి ధైర్యం చెప్పి సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడి నాగరాజును వారికి అప్పగించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర స్పందిస్తూ, కానిస్టేబుల్ అజర్ చూపిన అప్రమత్తత, మానవత్వాన్ని అభినందించారు. ప్రజల ప్రాణాలను కాపాడడంలో పోలీసులు ఎప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న జాతికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ