అక్షరటుడే, బాన్సువాడ: Banswada Student Suicide | పట్టణంలోని ఎస్సీ బాలికల గురుకుల వసతి గృహంలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో వార్డెన్‌పై చర్యలు తీసుకున్నారు. ఘటనలో నిర్లక్ష్యం ఉన్నట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వార్డెన్ మమతను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
Banswada Student Suicide | విచారణ అనంతరం..
ఈ ఘటనపై బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి వెంకటేష్ విచారణ చేపట్టి నివేదికను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan)కు సమర్పించారు. నివేదికను పరిశీలించిన కలెక్టర్ ఆదేశాల మేరకు వార్డెన్ మమతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. మృతురాలు వారం రోజుల క్రితమే బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరి, టీచర్స్ కాలనీలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఉంటోంది. బుధవారం కళాశాలకు వెళ్లకుండా హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగా, సంబంధిత అంశాలపై అధికారులు కూడా విచారణ చేపట్టారు.
ఇది కూడా చదవండి..: Hostel Students | హాస్టల్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. కలకలం రేపుతున్న వరుస ఘటనలు