NEET Paper Leak | విద్యార్థుల ముసుగులో అరాచకాలు సృష్టించింది కమ్యూనిస్టులే: బండి సంజయ్

నీట్ పేపర్ లీక్ వ్యవహారం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల భావోద్వేగాలతో ముడిపడి ఉందని, ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ఆవేదన చెందారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: NEET Paper Leak | నీట్ పేపర్ లీక్ వ్యవహారం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల భావోద్వేగాలతో ముడిపడి ఉందని, ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ఆవేదన చెందారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ( Bandi Sanjay )తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. నిందితులకు కఠిన శిక్షల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేశామని, సీబీఐ ద్వారా ఇప్పటివరకు 17 మందిని (11 మంది ఫ్యాకల్టీతో సహా) అరెస్ట్ చేశామని చెప్పారు. విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా కేవలం 40 రోజుల్లోనే మళ్లీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించామని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా దీనిపై క్షమాపణలు చెప్పారని గుర్తుచేశారు.

NEET Paper Leak | విద్యార్థుల ముసుగులో కుట్ర..

ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో విద్యార్థుల ముసుగులో కమ్యూనిస్టు శక్తులు అరాచకాలకు పాల్పడ్డాయని బండి సంజయ్ మండిపడ్డారు. పార్లమెంట్‌పై దాడికి కుట్ర పన్ని దేశ వ్యతిరేక నినాదాలు చేశారని ఆరోపించారు. పోలీసులు, జర్నలిస్టులు, ముఖ్యంగా మహిళా జర్నలిస్టులపై దాడులు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారన్నారు. ఈ ఘర్షణల్లో 118 మంది పోలీసులకు తీవ్ర గాయాలైనప్పటికీ, పోలీసులు సంయమనం పాటించి ఎలాంటి ఫైరింగ్ చేయలేదని, విధిలేని పరిస్థితుల్లోనే లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చిందని వివరించారు.

NEET Paper Leak | సోషల్ మీడియా అకౌంట్ల బ్లాక్..

పాకిస్థాన్ నుంచి సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ దేశంలో అశాంతి సృష్టిస్తున్నారని తెలిపారు. ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం, పాకిస్థాన్‌కు చెందిన 480 సోషల్ మీడియా అకౌంట్లను వెంటనే బ్లాక్ చేసిందని ఆయన వెల్లడించారు.

ఇది కూడా చదవండి:  BJYM District President | కేంద్ర పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *