అక్షరటుడే వెబ్‌డెస్క్: Vedanta Power Engineers | భారతీయ విద్యుత్ రంగం సరికొత్త వృద్ధి దశలోకి అడుగుపెడుతున్న తరుణంలో, ఇంజనీరింగ్ ప్రతిభ ప్రాముఖ్యతను వేదాంత పవర్ (Vedanta Power) ప్రత్యేకంగా హైలైట్ చేసింది. ఇంజనీర్స్ డే సందర్భంగా కంపెనీ కీలక వివరాలను వెల్లడించింది. ప్రస్తుతం తమ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 50 శాతం మంది ఇంజనీర్లే ఉండటం విశేషం. సంక్లిష్టమైన పవర్ అసెట్స్‌ను నిర్వహించడం, కొత్త టెక్నాలజీలను అందుకోవడం, మారుతున్న ఇంధన రంగానికి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో సాంకేతిక నిపుణుల పాత్ర ఎంతో కీలకమని కంపెనీ పేర్కొంది.
Vedanta Power Engineers | మహిళా ఇంజనీర్లకు ప్రాధాన్యం..
కేవలం టెక్నికల్ నిపుణులే కాకుండా, ఇంజనీరింగ్ రంగంలో స్త్రీ-పురుష భేదాలను తగ్గించి వైవిధ్యాన్ని (Diversity) ప్రోత్సహించడంలోనూ వేదాంత పవర్ ముందుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో నియమించుకున్న కొత్త ఇంజనీర్లలో గణనీయమైన సంఖ్యలో మహిళా ఉద్యోగులు ఉండటం గమనార్హం. పవర్ సెక్టార్ భవిష్యత్తు కోసం మరింత వైవిధ్యభూయిష్టమైన టాలెంట్ పూల్‌ను తయారు చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు కంపెనీ తెలిపింది.
Vedanta Power Engineers | యువతకు పెద్దపీట..
దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు (IITs), ఎన్ఐటీలు (NITs), ఐఐఎంలు (IIMs) వంటి ప్రముఖ విద్యాసంస్థల నుంచి క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ద్వారా యువ ఇంజనీర్లు, మేనేజ్‌మెంట్ నిపుణులను వేదాంత పవర్ ఆన్‌బోర్డ్ చేసుకుంది. వీరికి వ్యాపారంలో తగిన అనుభవాన్ని అందించడం ద్వారా రేపటి భారతీయ పవర్ సెక్టార్ లీడర్లుగా తీర్చిదిద్దడమే తమ ఉద్దేశమని కంపెనీ తెలిపింది.
Vedanta Power Engineers | సంక్లిష్టమైన పవర్ ప్రాజెక్ట్..
ఈ సందర్భంగా వేదాంత పవర్ సీఈవో , హోల్ టైమ్ డైరెక్టర్ శ్రీ రాజీందర్ సింగ్ అహుజా మాట్లాడుతూ.. “భారతదేశ పవర్ గ్రోత్ స్టోరీ అత్యంత ఉత్సాహకరమైన దశలో ఉంది. మనం కేవలం విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం మాత్రమే కాకుండా, టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సంక్లిష్టమైన పవర్ ప్రాజెక్ట్‌లను నిర్వహించే ఇంజనీరింగ్ సామర్థ్యాలను పెంపొందించుకోవాల్సి ఉంది. మా వర్క్‌ఫోర్స్‌లో సగం మంది ఇంజనీర్లే ఉండటం సంతోషకరం. ఇందులో యువత, ముఖ్యంగా మహిళా నిపుణులు ఎక్కువ సంఖ్యలో భాగస్వామ్యం కావడం భవిష్యత్తుపై మాకు మరింత నూతన ఉత్సాహాన్ని ఇస్తోంది” అని పేర్కొన్నారు. భారతదేశ మారుతున్న ఇంధన అవసరాలు, టెక్నాలజీ మార్పులకు అనుగుణంగా బలమైన సాంకేతిక నైపుణ్యాలు, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ఉన్న యువ నిపుణులను తయారు చేయడమే లక్ష్యంగా వేదాంత పవర్ ముందుకెళ్తోంది.
ఇది కూడా చదవండి: CBSE Three Language Policy | త్రిభాషా విధానం పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు