El Nino Effect | ఎల్​నినో ఎఫెక్ట్​.. ఈ ఏడాది తక్కువ వర్షాలు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: El Nino Effect | మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. దీంతో జూన్​ తొలివారంలో తొలకరి పలకరించనుంది. అయితే వాతావారణ శాఖ రైతులకు బ్యాడ్ న్యూస్​ చెప్పింది.

ఎల్​నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉంటాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 50 శాతం సాధారణ వర్షాలు, 50 శాతం లోటు వర్షాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ సంవత్సరం వర్షాకాలం 2018 నాటి పరిస్థితులను పోలి ఉంటుందన్నారు. గతేడాది రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. సాధారణం కంటే అత్యధికంగా వానల పడ్డాయి. అయితే ఈ ఏడాది పరిస్థితులు వేరుగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

El Nino Effect | నెలవారీ అంచనా

జూన్​లో సాధారణ వర్షాలు కురుస్తాయి. జూలై సాధారణం,ఆగస్టు సాధారణం కంటే తక్కువ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. సెప్టెంబర్​లో సైతం లోటు వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది. గత 5-6 ఏళ్లతో పోలిస్తే, ఈ సంవత్సరం రుతుపవన వర్షాలు తక్కువగానే ఉంటాయి. దక్షిణ, ఉత్తర తెలంగాణ (Telangana) జిల్లాలపై ‘లోటు వర్షాల’ ప్రభావం తీవ్రంగా ఉంటుంది, మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం సాధారణ వర్షాలు కురుస్తాయి. ఈ మేరకు రైతులు పంటల సాగుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులు సూచించారు.

హైదరాబాద్ నగరంలో ఈ ఏడాది సాధారణ స్థాయి నుండి స్వల్ప లోటు వర్షాలు కురుస్తాయని అంచనా. ఈ ఏడాది రుతుపవనాలు జూన్ రెండవ వారంలో తెలంగాణలోకి వస్తాయి.

ఇది కూడా చదవండి..: NMMS App Issues | గుండును గుర్తించని యాప్​.. ఉపాధి కూలీల ‘యాప్’​ కష్టాలు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *