Wet Paddy Procurement | తడిసిన వడ్లు కొనకుంటే ఆందోళన చేస్తాం..: మాజీ ఎమ్మెల్యే జాజాల

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Wet Paddy Procurement | తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనకుంటే రోడ్లను దిగ్బంధం చేస్తామని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ( Former MLA Jajala Surender)​ అన్నారు. నాగిరెడ్డిపేట (Nagireddy peta) మండలం గొలిలింగాల గ్రామంలో రెండు నెలల క్రితం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన సందర్శించారు.

Wet Paddy Procurement | రెండునెలలుగా క్రితం ప్రారంభించినా..

గొలిలింగాల గ్రామంలో రెణ్నెళ్ల క్రితం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ఇప్పటికీ ధాన్యం కొనుగోళ్లు పూర్తికాకపోవడంపై మాజీ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షం కారణంగా ధాన్యం పూర్తిగా తడిసిపోయిందన్నారు. తడిసిన వడ్లకు మొలకలు వచ్చినా అధికారులు స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ పాలనలో పాలకులు, అధికారులు రైతుల ఉసురు పోసుకుంటున్నారన్నారు. రెండు నెలలుగా కొనుగోలు కేంద్రాల వద్దే కాపలా ఉంటున్నారని, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని ఆయన వాపోయారు. తడిసిన ధాన్యాన్ని తేమ, తాలు పేరుతో తిరస్కరిస్తారేమోనని రైతులు భయపడుతున్నారన్నారు.

Wet Paddy Procurement | అసమర్థ పాలనతో రైతులు బేజారు..

అసమర్థ పాలనతో రైతులు బేజారవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజమమని ఆయన ప్రశ్నించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనే దిక్కు లేకుండా చేశారని మండిపడ్డారు. రాబోయే రెండు రోజుల్లో కల్లాల్లోని మొత్తం వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని (Grain Purchase), తడిసిన ప్రతి గింజకూ మద్దతు ధర చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని, అవసరమైతే జాతీయ రహదారిపై ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలు, రైతు సంఘం నాయకులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

dhanyan2

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *