NMMS App Issues | గుండును గుర్తించని యాప్​.. ఉపాధి కూలీల ‘యాప్’​ కష్టాలు

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: NMMS App Issues | వేసవి కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతున్నాయి. నిత్యం ఉదయాన్నే కూలీలు పనులకు వెళ్తున్నారు. ఉపాధి పనుల్లో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) ఎన్​ఎంఎంఎస్​ యాప్​ ద్వారా అటెండెన్స్​ విధానం తీసుకొచ్చింది.

ఉపాధి పనులకు వెళ్లిన కూలీలు ఉదయం వెళ్లగానే యాప్​లో ఫొటోదిగాలి. అనంతరం పనులు ముగించుకొని ఇళ్లకు వచ్చే సమయంలో మళ్లీ ఫొటో దిగాలి. అయితే కూలీలను యాప్​ గుర్తించడం లేదు. దీంతో ఉపాధి హామీ సిబ్బందితో పాటు కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

NMMS App Issues | మహబూబ్​నగర్​లో..

మహబూబాబాద్ జిల్లా (Mahabubabad District)లో ఒక కూలీ గుడిలో తలనీలాలు సమర్పించుకున్నాడు. ఇనుగుర్తి మండలం (Inugurthi Mandal) కోమటిపల్లి గ్రామంలో మల్యాల శ్రీనివాస్ అనే వ్యక్తి ఇటీవల కొండగట్టులో గుండు చేయించుకున్నాడు. గుండుతోనే వంద రోజుల పనికి వెళ్లాడు. అయితే ఫేస్ యాప్ లో హాజరు నమోదు చేసేందుకు ప్రయత్నించగా అతన్ని గుర్తించలేదు. ఎన్ని సార్లు ఫొటో తీసినా అటెండెన్స్​ నమోదు కాలేదు.

NMMS App Issues | యాప్​లో సాంకేతిక లోపాలు

దీంతో మరో మహిళ కూలీ వినూత్నంగా ఆలోచించింది. ముఖ ధృవీకరణ (face verification) సమయంలో, అతనితో పనిచేసే ఒక మహిళా తన జుట్టుతో అతని గుండును కప్పి ఉంచిన తర్వాతే, ఆ యాప్​అతన్ని గుర్తించింది.యాప్​లో సాంకేతిక లోపాలు, నెట్​వర్క్​ సమస్యల కారణంగా తమ వేతనాలు చెల్లింపు ఇప్పటికే ఆలస్యమవుతోందని కార్మికులు వాపోతున్నారు. ఈ విచిత్రమైన జుట్టు ఉపాయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఇది కూడా చదవండి..: Mahalakshmi Card | ‘మహాలక్ష్మి’ కార్డుంటేనే బస్సులో ఫ్రీ.. జూన్‌ 2నుంచి పంపిణీ చేసే అవకాశం!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *