అక్షరటుడే, వెబ్డెస్క్ : Vikarabad Mother Suicide | వికారాబాద్ జిల్లా (Vikarabad District)లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
పూడురు మండలం మాటుగూడకు చెందిన రాజుకు భార్య మమత (30), పిల్లలు జనశ్రీ (8), సాకేత్ ఉన్నారు. కుటుంబ కలహాలతో శుక్రవారం ఉదయం మమత తన ఇద్దరు పిల్లలను తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తన పుట్టిల్లు నారాయణపూర్ గ్రామానికి వెళ్తున్నానని భర్తతో చెప్పింది. అయితే ఆమె మార్గమధ్యలో సోమన్‌గర్తి గ్రామ సమీపంలో పిల్లలతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
Vikarabad Mother Suicide | ఇంటికి వెళ్లకపోవడంతో..
మమత అటు పుట్టింటికి వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. ఈ క్రమంలో సోమనుర్తి శివారులోని ఓ వ్యవసాయ బావిలో ఆమె విగజతజీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యలకు కారణం అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇది కూడా చదవండి..: Child Rape Case | బాలికపై అత్యాచారం కేసులో వృద్ధుడికి జీవిత ఖైదు