Woman Murder Case | వివాహిత మహిళ దారుణ హత్య

Srinivas Kolluri

అక్షరటుడే, బాన్సువాడ: Woman Murder Case | మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన వర్ని మండలంలో (Varni Mandal) చోటు చేసుకుంది.

Woman Murder Case | వర్ని మండలం పొట్టిగుట్ట తండా..

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్ని మండలం పొట్టిగుట్ట తండాకు చెందిన కవితకు చందూర్ మండలం (Chandur Mandal) మేడిపల్లి తండాకు చెందిన సంతోష్‌తో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు ఉంది. అయితే కొన్నాళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో సంతోష్ మృతి చెందడంతో కవిత తన పుట్టింటికి వచ్చేసింది. ఆ తర్వాత కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ఓ వ్యక్తితో గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి సదరు వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేసినట్లు సమాచారం. ఘటనా స్థలంలోనే కవిత మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసి ఉంటుందనే కోణంలో పోలీసు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి..: Kamareddy Fuel Shortage | కామారెడ్డిలో కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ కష్టాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *