అక్షరటుడే, వెబ్‌డెస్క్: Devadula Project | ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడటం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) అన్నారు. ములుగు జిల్లాలోని దేవాదుల ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. పంపుహౌస్, ఇన్‌టేక్ వెల్ పనుల పురోగతి, నీటి తరలింపు సామర్థ్యాన్ని మంత్రులు పరిశీలించారు.
రాష్ట్రంలో వర్షాలు లేకపోవడంతో కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి ప్రాజెక్టులు నింపాలని బీఆర్ఎస్ నాయకులు కోరుతున్న విషయం తెలిసిందే. దీంతో దేవాదుల ద్వారా జలాశయాలు నింపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మంత్రుల బృందం తాజాగా దేవాదుల ప్రాజెక్ట్‌ను పరిశీలించింది. వర్షాలు లేకపోవడంతో రిజర్వాయర్లను నింపుకునే ప్రయత్నాలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. దేవాదుల జలాల ద్వారా 22 రిజర్వాయర్లు నింపుతామని పేర్కొన్నారు.
Devadula Project | రైతులు ఆందోళన చెందొద్దు
సమ్మక్క బ్యారేజ్‌లో నీరు నిల్వ ఉంచుకుంటేనే పంపింగ్ చేసుకొనే అవకాశం ఉంటుందని భట్టి అన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మేడిగడ్డ ఎవరి హయాంలో కూలిందో అందరికీ తెలుసని బీఆర్ఎస్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాము చెప్పిందే చేస్తాం.. చేసేదే చెబుతామన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఎండాకాలానికి మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను రిపేర్ చేసి అందుబాటులోకి తెస్తామన్నారు.
ఇది కూడా చదవండి..: Unani Medical Services | యునాని వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయాలి