అక్షరటుడే, వెబ్డెస్క్: Unani Medical Services | యునాని వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Raja Narasimha) అధికారులను ఆదేశించారు. ఆయుష్ శాఖ పనితీరు, నిజామియా హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవలపై ఆయన సమీక్షింఆరు.
హైదరాబాద్లోని ప్రభుత్వ నిజామియా టిబ్బీ కాలేజీ, నిజామియా జనరల్ హాస్పిటల్ రాష్ట్రంలో యునాని వైద్య సేవలకు ప్రతిష్ఠాత్మక సంస్థలని మంత్రి పేర్కొన్నారు. వాటి అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. హాస్పిటల్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఓపీ బ్లాక్, ఫార్మసీ భవనం పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. హాస్పిటల్లో డాక్టర్లు, టీచింగ్ ఫాకల్టీ, ఇతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండడంతో వైద్య సేవలు, విద్యా కార్యకలాపాలపై ప్రభావం పడకుండా వెంటనే ఖాళీల భర్తీకి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
Unani Medical Services | సమస్యలపై ఆరా

ఆయుష్ డైరెక్టర్ శ్రీకాంత్ బాబు మాట్లాడుతూ.. ఆయుష్లో గతేడాది 138 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయడంతో డాక్టర్ల కొరత తీరిందన్నారు. నిజామియా టిబ్బీ కాలేజీ, నిజామియా జనరల్ హాస్పిటల్ వారసత్వ భవనాల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రూ.52.50 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించినట్లు వివరించారు. శాఖ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై కూడా మంత్రి ఆరా తీశారు. రాష్ట్ర స్థాయి యునాని డ్రగ్ తయారీ యూనిట్ ఏర్పాటుకు సిద్ధం చేసిన ప్రాజెక్టు ప్రతిపాదనను వేగవంతం చేయాలని సూచించారు.
ఇది కూడా చదవండి..: BRS Blood Donation | సీఎం రేవంత్ రెడ్డికి రక్తదానం.. బీఆర్ఎస్ నిరసనతో తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత