అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Srisailam Inflow | శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. ఎగువన కృష్ణా బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టులు నిండటంతో శ్రీశైలం డ్యామ్ (Srisailam Dam)కు భారీగా ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్ట్ నీటిమట్టం వేగంగా పెరుగుతోంది.
కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండాయి. అంతేగాకుండా తుంగభద్ర నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో జూరాల మీదుగా శ్రీశైలానికి వరద కొనసాగుతోంది. జూరాలకు 2,44,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, అక్కడి నుండి జలవిద్యుత్ ఉత్పత్తి, 33 స్పిల్‌వే గేట్ల ద్వారా 2,45,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ నీరు శ్రీశైలానికి చేరుతోంది.
Srisailam Inflow | 117 టీఎంసీల నిల్వ
శ్రీశైలం నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నిల్వ 118 టీఎంసీలకు పెరిగింది. ఇంకా కుడి, ఎడమ గట్ల విద్యుత్ కేంద్రాలలో ఉత్పత్తి ప్రారంభం కాలేదు. మరో నాలుగు రోజులు ఇలాగే వరద కొనసాగితే ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. దీంతో విద్యుత్ ఉత్పత్పి ప్రారంభించడంతో పాటు గేట్లు ఎత్తి నాగర్జున సాగర్‌కు నీటిని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం సుమారు 2.45 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహంతో, రోజుకు దాదాపు 21 టీఎంసీల నీరు చేరుతోంది. జలాశయం పూర్తి నిల్వ సామర్థ్యాన్ని చేరుకోవడానికి ఇంకా దాదాపు 97 టీఎంసీల నీరు అవసరం.
ఇది కూడా చదవండి..: Mandal Prajavani | ఇక నుంచి అన్ని మండలాల్లో ‘ప్రజావాణి’