అక్షరటుడే, వెబ్‌డెస్క్: Aug 05 Gold Prices | అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో దేశీయ బంగారం మార్కెట్‌లో ధరలు స్వల్ప మార్పులతో కొనసాగుతున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలపై నెలకొన్న ఆశావహ సంకేతాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్ వడ్డీ రేట్లపై మార్కెట్‌లో కొనసాగుతున్న అంచనాల నేపథ్యంలో బంగారం ధరల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. గత కొన్ని రోజులుగా స్థిర ధోరణి కొనసాగుతుండగా.. తాజాగా స్వల్ప తగ్గుదల నమోదైంది.
Aug 05 Gold Prices | బులియన్ మార్కెట్‌లో..
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బుధవారం ఉదయం నాటికి 24 క్యారెట్ల (99.9 శాతం స్వచ్ఛత) బంగారం 10 గ్రాముల ధర రూ.1,43,990గా నమోదైంది. 22 క్యారెట్ల (91.6 శాతం స్వచ్ఛత) బంగారం 10 గ్రాముల ధర రూ.1,31,990గా ఉండగా, 18 క్యారెట్ల (75 శాతం స్వచ్ఛత) 10 గ్రాముల పసిడి ధర రూ.1,07,990గా ఉంది.
తెలంగాణలోని వరంగల్, నిజామాబాద్, ఖమ్మం నగరాల్లో కూడా హైదరాబాద్‌తో సమానంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,990, 22 క్యారెట్ల ధర రూ.1,31,990, 18 క్యారెట్ల ధర రూ.1,07,990గా నమోదైంది.
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి నగరాల్లోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఈ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,43,990, 22 క్యారెట్లు రూ.1,31,990, 18 క్యారెట్ల గోల్డ్ రూ.1,07,990గా ఉంది.
Aug 05 Gold Prices | దేశంలోని ప్రధాన నగరాల్లో..
దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలే కనిపిస్తున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,43,990, 22 క్యారెట్లు రూ.1,31,990, 18 క్యారెట్లు రూ.1,10,140గా నమోదైంది. ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, కేరళలో 24 క్యారెట్ల బంగారం రూ.1,43,990, 22 క్యారెట్లు రూ.1,31,990, 18 క్యారెట్లు రూ.1,07,990గా కొనసాగుతున్నాయి.
అదే సమయంలో ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,44,140, 22 క్యారెట్ల ధర రూ.1,32,140, 18 క్యారెట్ల ధర రూ.1,08,140గా ఉంది.
వడోదరాలో వరుసగా రూ.1,44,040, రూ.1,32,040, రూ.1,08,040గా నమోదయ్యాయి. జైపూర్, లఖ్నవూ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం రూ.1,44,140, 22 క్యారెట్లు రూ.1,32,140, 18 క్యారెట్లు రూ.1,08,140గా కొనసాగుతున్నాయి.
Aug 05 Gold Prices | ప్రభావిత అంశాలు…
అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, డాలర్ మారకం విలువ, కేంద్ర బ్యాంకుల విధాన నిర్ణయాలు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు వంటి అంశాలు రాబోయే రోజుల్లో బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.