అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vehicle to Vehicle | దేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడంతో పాటు స్మార్ట్ smart మొబిలిటీకి ఊతమిచ్చే కీలక నిర్ణయం దిశగా కేంద్ర ప్రభుత్వం govt అడుగులు వేస్తోంది.
కొత్తగా తయారయ్యే వాహనాల్లో Vehicle-to-Vehicle (V2V) కమ్యూనికేషన్ వ్యవస్థను తప్పనిసరి చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Vehicle to Vehicle | L, M, N కేటగిరీ వాహనాలన్నింటిలో..
ప్రతిపాదన ప్రకారం అక్టోబరు 1, 2028 నుంచి తయారయ్యే కొత్త ద్విచక్ర, త్రిచక్ర, కార్లు, బస్సులు, ట్రక్కులు తదితర L, M, N కేటగిరీ వాహనాలన్నింటిలో V2V వ్యవస్థను అమలు చేయాలని సూచించింది. దీనిపై ప్రజలు, పరిశ్రమల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన అనంతరం తుది నోటిఫికేషన్ జారీ కానుంది.
Vehicle to Vehicle | వైర్‌లెస్ పద్ధతిలో రియల్‌టైమ్ సమాచారం
V2V టెక్నాలజీ ద్వారా వాహనాలు ఒకదానితో ఒకటి వైర్‌లెస్ పద్ధతిలో రియల్‌టైమ్ సమాచారాన్ని పంచుకుంటాయి. వాహనం వేగం, దిశ, స్థానం, బ్రేకింగ్, వేగవంతమైన మలుపులు వంటి వివరాలు సమీప వాహనాలకు వెంటనే చేరుతాయి.
Pradeep Rawat Death | బిక్షూ యాదవ్ ఇక లేరు..విలక్షణ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత
దీంతో ఆకస్మిక బ్రేకింగ్, ముందున్న వాహనంతో ఢీకొనే ప్రమాదం, తప్పు దిశలో వచ్చే వాహనాలు, అత్యవసర సేవల వాహనాల రాక వంటి పరిస్థితుల్లో డ్రైవర్‌కు ముందుగానే హెచ్చరికలు అందే అవకాశం ఉంటుంది.
Vehicle to Vehicle | AIS-230 ప్రమాణాలకు అనుగుణంగా..
ప్రతిపాదిత నిబంధనల ప్రకారం 2027 అక్టోబర్ 1 నుంచి V2V సదుపాయం ఉన్న వాహనాలు AIS-230 ప్రమాణాలకు అనుగుణంగా ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత అక్టోబరు 1, 2028 నుంచి కొత్తగా తయారయ్యే సంబంధిత వాహనాలన్నింటిలో ఈ వ్యవస్థను తప్పనిసరిగా అమర్చాలని కేంద్రం ప్రతిపాదించింది.
వాహన తయారీ సంస్థలు, విడిభాగాల తయారీదారులు కొత్త నిబంధనలకు అనుగుణంగా సిద్ధమయ్యేందుకు దశలవారీ అమలు విధానాన్ని ప్రభుత్వం సూచించింది.
Vehicle to Vehicle | భద్రత మరింత మెరుగు..
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. V2V వ్యవస్థ అమల్లోకి వస్తే రోడ్డు భద్రత మరింత మెరుగుపడటంతో పాటు ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అంతేకాదు, భవిష్యత్తులో కనెక్టెడ్ మొబిలిటీ, ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్ (ITS), అధునాతన డ్రైవర్ సహాయక వ్యవస్థలు (ADAS) మరింత సమర్థవంతంగా పనిచేయడానికి కూడా ఈ సాంకేతికత కీలకంగా మారనుంది.
అయితే ప్రస్తుతం ఇది డ్రాఫ్ట్ ప్రతిపాదన మాత్రమే. ప్రజల అభిప్రాయాల పరిశీలన అనంతరం కేంద్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.