Aug 05 Market Analysis | గ్రీన్‌లో గ్లోబల్ మార్కెట్లు..గ్యాప్​అప్​ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు లాభాల బాటలో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ లాభాలతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Aug 05 Market Analysis | యూఎస్(US) స్టాక్ మార్కెట్ గత సెషన్‌లో భారీ లాభాలతో ముగిసింది. యూరోప్ మార్కెట్లలో లాభాల పరంపర కొనసాగుతోంది. బుధవారం ప్రధాన ఆసియా మార్కెట్లు కూడా పాజిటివ్ గా ఉన్నాయి.

ఆర్బీఐ ఎంపీసీ సమావేశ(RBI MPC Meeting) తీర్మానాల ప్రకటనకు ముందు భారత స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలతో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Aug 05 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 2.59 శాతం, ఎస్ అండ్ పీ 1.79 శాతం లాభపడ్డాయి. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.34 శాతం లాభంతో ఉంది.

Aug 05 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.20 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.61 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.77 శాతం పెరిగాయి.

Vehicle to Vehicle | రోడ్లపై మాట్లాడుకునే వాహనాలు..2028 నుంచి V2V వ్యవస్థ తప్పనిసరి చేయాలని కేంద్రం ప్రతిపాదన!

Aug 05 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 4.10 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 3.34 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 3.16 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.74 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.21 శాతం లాభంతో ఉండగా.. సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.41 శాతంనష్టాలతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.67 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు భారీ గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా ఆరో సెషన్‌లోనూ తమ కొనుగోళ్ల పరంపరను కొనసాగించారు. గత సెషన్‌లో నికరంగా రూ. 2,446 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.

  • డీఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 936 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 3 పైసలు బలహీనపడి 95.38 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.88 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.61 వద్ద ఉన్నాయి.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.40 నుంచి 0.99 కు తగ్గింది.
  • విక్స్ 2.22 శాతం పెరిగి 12.19 వద్ద ఉంది.
  • క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 79.05 డాలర్ల వద్ద ఉంది.
Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *