అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: TPCC Chief | పదేళ్ల బీఆర్ఎస్ అరాచక పాలనను ప్రజలు మర్చిపోలేదని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(Bomma Mahesh Kumar Goud) అన్నారు. వారిది అరాచక పాలన అయితే కాంగ్రెస్‌ది ప్రజాపాలన అని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్(Nizamabad) నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
TPCC Chief | ఉద్యోగాల పేరుతో కేటీఆర్ దొంగ ఏడుపు
బీఆర్ఎస్ పాలనలో కేవలం కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని ఎందరో నిరుద్యోగుల ఉసురు పోసుకున్న కేటీఆర్‌కు(KTR) మాట్లాడే అర్హత లేదని పీసీసీ చీఫ్ అన్నారు. ఉద్యోగాల పేరుతో కేటీఆర్ దొంగ ఏడుపు ఏడుస్తుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. అప్పట్లో ఇరిగేషన్ శాఖలో తప్పులకు కేంద్ర బిందువు అయిన హరీష్ రావు ఈరోజు కరువు కరువు అంటూ ఏకరువు పెట్టడం దుర్మార్గమన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అంతా తానే నడిపిన కేసీఆర్ కాళేశ్వరాన్ని నిర్మించి వేల కోట్లు దోచుకున్నారన్నారు. కాళేశ్వరం నీళ్ల పేరుతో దోపిడీ జరిగిందన్నారు. ఒకచోట కట్టాల్సిన ప్రాజెక్టును మరోచోట కట్టి కమీషన్ల దందా చేసిన కేసీఆర్ కుటుంబం.. ప్రాజెక్టు కుంగిపోవడానికి కారణం కాదా అన్నారు.
TPCC Chief | రెండున్నర ఇళ్లలో 70 వేల ఉద్యోగాలు
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చిందని.. వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయని బొమ్మ మహేష్ కుమార్ అన్నారు. అసత్యాలు ప్రచారం చేసినంత మాత్రాన ప్రజలు నమ్మేస్థితిలో లేరని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మెజార్టీ హామీలను పూర్తి చేశామని స్పష్టం చేశారు. ఈరోజు పేద ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని.. ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ఇలా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వెళ్తున్నామన్నారు. రూ.20వేల కోట్లకు పైగా రుణమాఫీ చేశామని వివరించారు. విద్యావైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఆయన తెలిపారు. నియోజకవర్గానికి మూడు వేలకు పైగా ఇళ్లు ఇచ్చామని.. ఇందిరమ్మ ఇళ్లతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
TPCC Chief | ఆర్వోబీ పనులు త్వరలోనే పూర్తవుతాయి
మాధవనగర్ వద్ద ఆర్వోబీ పనులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జరుగుతున్నాయని బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్రం తరపున అందాల్సిన నిధులు త్వరలోనే అందుతాయని.. తద్వారా ఆర్వోబీ పనులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. బాల్కొండలో అభివృద్ధి జరగట్లేదని ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి పసలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, డీసీసీ జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి, డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కవితా రెడ్డి, కౌడపు శరత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
TPCC Chief, Bomma Mahesh Kumar Goud, Telangana Congress, BRS, Telangana Politics, Nizamabad News, Congress Government, Political News
ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో కొత్త ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి బాధ్యతల స్వీకరణ