Armur Bus Accident | ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ.. తొమ్మిది మందికి గాయాలు

Naresh Chandan
Armur Bus Accident

అక్షరటుడే, ఆర్మూర్​: Armur Bus Accident | నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పరిసరాల్లో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జక్రాన్‌పల్లి మండలం ఆర్గుల్ వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో 9 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

ఆర్మూర్ ఆర్టీసీ డిపోకు చెందిన ప్రైవేట్ బస్సు సుమారు 20 మంది ప్రయాణికులతో ఆర్మూర్ వైపు ప్రయాణిస్తుండగా, ఆర్గుల్ వద్ద ప్రయాణికులను దింపేందుకు డ్రైవర్ బస్సును ఆపాడు. ఈ సమయంలో వేగంగా వచ్చిన లారీ బస్సును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 9 మంది గాయపడ్డారు.

Armur Bus Accident | సీపీ పరామర్శ

సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సేవలు స్పందించి, గాయపడిన వారిని 108 అంబులెన్సుల ద్వారా ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిలో కొందరి పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆసుపత్రికి చేరుకుని గాయపడిన వారిని పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను పరిశీలించి, అధికారులకు తగిన సూచనలు చేశారు. ఆయన వెంట స్థానిక నాయకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

త్రిశూర్ పేలుడు బాధితులకు అండగా కల్యాణ్ జువెలర్స్: ఒక్కో కుటుంబానికి ₹5 లక్షల ఆర్థిక సాయం

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *