Deputy Collector ACB Case | డిప్యూటీ కలెక్టర్ అక్రమాస్తులు మాములుగా లేవుగా!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Deputy Collector ACB Case | మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్ కార్యాలయంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మర్రి వంశీ మోహన్‌ (Deputy Collector Vamsi Mohan)పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు అయింది. దీంతో ఏసీబీ (ACB) అధికారులు శుక్రవారం ఆయన నివాసాల్లో తనిఖీలు చేశారు.

వంశీ మోహన్ తన సర్వీసు కాలంలో అవినీతి పద్ధతులు, అనుమానాస్పద మార్గాల ద్వారా ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. శుక్రవారం ఉదయం అతడి కార్యాలయం, మరియు అతని బంధువులు, సహచరులు, బినామీదార్లకు చెందిన మరో 11 ప్రదేశాలలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ సోదాల సమయంలో, అనేక ఆస్తి పత్రాలను గుర్తించారు.

Deputy Collector ACB Case | 19 ఓపెన్​ ప్లాట్లు

డిప్యూటీ కలెక్టర్​ అక్రమాస్తులు రూ.వందల కోట్లు ఉంటుందని సమాచారం. అధికారుల తనిఖీల సమయంలో 19 ఓపెన్​ ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 4,46,28,000 కోట్లు ఉంటుంది. వనస్థలిపురంలోని ఎన్జీఓస్ కాలనీలో ఉన్న ఒక ఇల్లు, మణికొండ (Manikonda)లో ఒకటి (1000 చ.అ.) మరియు మజీద్‌బండలో మరొకటి (2000 చ.అ.) ఉన్న రెండు ఫ్లాట్లు, వీటన్నిటి విలువ రూ.1.12 కోట్లు. ఇబ్రహీంపట్నం నర్రేపల్లిలో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఫామ్​ ఉంది. వీటి విలువ బహిరంగ మార్కెట్లో చాలా రెట్లు అధికంగా ఉంటుంది.

నిందితుడి ఇంట్లో రూ. 2,10,800 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 20,00,000 బ్యాంకు నిల్వ, 122 గ్రాముల బరువున్న బంగారు ఆభరణాలు, రూ.32 లక్షల విలువైన రెండు వాహనాలు, అవి ఒక టయోటా ఇన్నోవా క్రిస్టా, ఒక కియా కారును గుర్తించారు. కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

దీనిని కూడా చదవండి : Telangana New Pensions | జూన్​ 2 నుంచి కొత్త పింఛన్లు : మంత్రి సీతక్క

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *