DCA Raids | కండల కోసం ఇంజెక్షన్ల వినియోగం.. జిమ్​లపై అధికారుల చర్యలు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : DCA Raids | జిమ్​లలో మాదక ద్రవ్యాల వినియోగంపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. వరంగల్​ (Warangal)లో తనిఖీలు చేపట్టి అక్రమంగా నిల్వ ఉంచిన టెర్మిన్ (మెఫెంటెర్మైన్ సల్ఫేట్) ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.

చాలా మంది జిమ్​కు వెళ్తుంటారు. ముఖ్యంగా యువత జిమ్​లకు వెళ్లి కండలు పెంచాలని భావిస్తారు. సిక్స్​ ప్యాక్​ల కోసం ప్రయత్నిస్తారు. సినిమాల్లో చూసి హీరోల్లా బాడీ ఉండాలని కలలు కంటారు. అయితే జిమ్​లలో ఎంత సాధన చేసిన వారు అనుకున్న కండలు రాకపోవడంతో పలువురు అక్రమ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇంజెక్షన్లు, పౌడర్లు తీసుకొని బాడీ పెంచుకుంటున్నారు.

DCA Raids | ఇంజెక్షన్ల స్వాధీనం

DCA Raids

తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు వరంగల్‌లో తనిఖీలు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన టెర్మిన్ ఇంజెక్షన్లను గుర్తించారు. చార్బౌలిలో మహమ్మద్ అబ్దుల్ సోహైబ్ అనే వ్యక్తి బాడీబిల్డింగ్‌లో దుర్వినియోగం కోసం జిమ్‌కు వెళ్లేవారికి దీనిని విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఆ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. పలు జిమ్​లలో తనిఖీలు చేశారు. ఇలాంటి మాదకద్రవ్యాలు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

DCA Raids | ప్రాణాలకు ముప్పు

కండల కోసం యువత ఇంజెక్షన్లు తీసుకోవడం, పౌడర్లు వాడటం చేస్తున్నారు. దీంతో అప్పటి వరకు బాగానే ఉన్నా.. భవిష్యత్​లో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇవి తీసుకునే వారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేగాకుండా వీటిని వాడటం మానేసిన తర్వాత బాడీ లూజ్​ అవుతుంది. యువతను లక్ష్యంగా చేసుకొని కొందరు జిమ్​ నిర్వాహకులు వీటిని విక్రయిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Kavitha Singareni Visit | 15 నుంచి సింగరేణిలో పర్యటించనున్న కవిత

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *