Nagaraju Appointment | ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర మీడియా వైస్ ఛైర్మన్​గా నాగరాజు

తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర మీడియా కమిటీ వైస్ ఛైర్మన్​గా భిక్కనూరుకు చెందిన గజవాడ నాగరాజు నియమితులయ్యారు.

shashi kiran Mottala

అక్షరటుడే, భిక్కనూరు : Nagaraju Appointment | తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర మీడియా కమిటీ వైస్ ఛైర్మన్​గా భిక్కనూరుకు చెందిన గజవాడ నాగరాజు నియమితులయ్యారు. ఈ మేరకు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ ఆదేశాలు జారీ చేశారు.

Nagaraju Appointment | భిక్కనూరులో..

Nagaraju Appointment

భిక్కనూరు (Bikhnoor)లో శుక్రవారం ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, రీజినల్ ఛైర్మన్​ శనిశెట్టి గౌరీశంకర్ నియామక పత్రాన్ని గజవాడ నాగరాజుకు అందజేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ఆర్య వైశ్య మహాసభ ఆశయాలను నెరవేరుస్తానన్నారు. తనను నియమించినందుకు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీ నారాయణ, ఉపాధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు, రీజినల్ ఛైర్మన్​ గౌరీశంకర్​కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో భిక్కనూరు ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్, కోశాధికారి కోడిప్యాక వెంకటేశం, ప్రతినిధులు పబ్బ నాగరాజు, చీకోటి నాగభూషణం, గంగెల్లి మధుసూదన్​, పబ్బ కిరణ్, గంజి శ్రీనివాస్​, శ్రీరామ్ కృష్ణమూర్తి, సిద్దగిరి, అతిమముల రమేష్, గౌరీశెట్టి రవి కుమార్, జగదీశ్వర్​, రమేష్, రాజయ్య, చంద్రమౌళి, శ్రీనివాస్​ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: BRS Urea Protest | కొత్త ఊపులో గులాబీదళం.. యూరియా పోరుతో క్షేత్రబాట..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *