తెలంగాణTelangana New Pensions | జూన్​ 2 నుంచి కొత్త పింఛన్లు : మంత్రి సీతక్క

Telangana New Pensions | జూన్​ 2 నుంచి కొత్త పింఛన్లు : మంత్రి సీతక్క

రాష్ట్రంలో జూన్​ 2 నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana New Pensions | రాష్ట్రంలో పింఛన్​ కోసం ఎదురు చూస్తున్న వారికి మంత్రి సీతక్క (Minister Seethakka) గుడ్​ న్యూస్​ చెప్పారు. జూన్​ 2 నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా ములుగు (Mulugu) జిల్లా స్థాయి సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడారు.

రాష్ట్రంలో కొన్నేళ్లుగా కొత్త పింఛన్లు ఇవ్వడం లేదు. బీఆర్​ఎస్​ హయాంలో పింఛన్లు ఇచ్చారు. దీంతో చాలా మంది పింఛన్​ కోసం ఎదురు చూస్తున్నారు. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులు కొత్త పెన్షన్ల కోసం కొన్ని రోజులుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం జూన్​ 2 నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. సంక్షేమ పథకాలకు అర్హుల జాబితా వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు.

Telangana New Pensions | పలు పథకాల అమలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్​ 2 నుంచి పలు పథకాలు అమలు చేయనున్నట్లు సీతక్క తెలిపారు. కొత్త పింఛన్లతో పాటు, రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses) మంజూరు చేస్తామని వెల్లడించారు. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్​ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్నరకం వడ్లకు బోనస్ తదితర పథకాల గురించి వివరించారు.

Telangana New Pensions | విద్యార్థులకు అల్పాహారం

ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేస్తామని సీతక్క తెలిపారు. ఇందులో భాగంగా ఒక రోజు రాగి జావ, మరుసటి రోజు వేడి పాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. అధికారులు పారదర్శకతతో పథకాలను అమలు చేయాలని మంత్రి సూచించారు. లబ్ధిదారుల జాబితాను పథకాల వారీగా సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ఇప్ప చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తుందని ఇప్ప పువ్వు తో అనేక లాభాలు ఉన్నాయని మంత్రి తెలిపారు.

దీనిని కూడా చదవండి : ACB Raids on Deputy Collector | డిప్యూటీ కలెక్టర్​ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీగా అక్రమాస్తుల గుర్తింపు

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

SRH vs RCB | IPL 2026: హైదరాబాద్ భారీ లక్ష్యం.. పవర్‌ప్లేలోనే ఆర్సీబీ కీలక వికెట్లు డౌన్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH vs RCB | రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో...

NIMS Kidney Transplants | కిడ్నీ ట్రాన్స్​ప్లాంట్స్​లో నిమ్స్​ అరుదైన రికార్డు.. 2K మైలురాయి పూర్తి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: NIMS Kidney Transplants | కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్స్...

SBI Employees Candle Rally | ఎస్​బీఐ ఉద్యోగుల క్యాండిల్​ ర్యాలీ..

​అక్షరటుడే, ఇందూరు: SBI Employees Candle Rally | స్టేట్ బ్యాంక్​...

Vaddi Leni Runalu | మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్: వడ్డీ లేని రుణాలు రూ.10 లక్షలకు పెంపు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vaddi Leni Runalu | తెలంగాణలోని మహిళా స్వయం...