నిజామాబాద్Urban Development Focus | అధికారులు ‘అర్బన్’​పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది: ఎమ్మెల్యే ధన్​పాల్​

Urban Development Focus | అధికారులు ‘అర్బన్’​పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది: ఎమ్మెల్యే ధన్​పాల్​

అధికారులు అర్బన్ నియోజకవర్గంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ అన్నారు.

అక్షరటుడే, ఇందూరు: Urban Development Focus | అధికారులు అర్బన్ నియోజకవర్గంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని.. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా పనిచేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal) అన్నారు. జిల్లా కలెక్టరేట్​లో శుక్రవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.

Urban Development Focus | నగరంలో అనేక సమస్యలు

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు అర్బన్ విషయంలో ప్రతి పథకంపై దృష్టి సారించాలని సూచించారు. నివేదికలు ఇస్తున్నారు కానీ 99 రోజుల్లో ఏం చేశారో చెప్పలేదన్నారు. ప్రతి శాఖ నివేదికలు ఒకలా ఉంటే క్షేత్రస్థాయిలో ప్రగతి మరోలా ఉంటుందన్నారు. నిజామాబాద్ అర్బన్​లో (Nizamabad Urban) అనేక సమస్యలు ఉన్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా నూతన బస్టాండ్ (Bus stand) నిర్మాణం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్(Young India Integrated School), ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కేటాయింపు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇలా అనేకం ఉన్నాయన్నారు. ముఖ్యంగా యూజీడీ వర్క్ నత్తనడకన కొనసాగుతుందన్నారు. జిల్లాలో ఇతర నియోజకవర్గాల్లో జరుగుతున్నంత వేగంగా అర్బన్​లో పథకాలు అందడం లేదన్నారు. కార్యక్రమంలో రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఉర్దూ అకాడమీ ఛైర్మన్​ తాహెర్​ బిన్​ హందాన్​, కలెక్టర్​ ఇలా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.

photo 2

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Jukkal MLA Comments | పోలీస్ vs ప్రజాప్రతినిధులు! అధికార పక్షంలో నివురుగప్పిన నిప్పులా ‘మాఫియా’ వివాదం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Jukkal MLA Comments | తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు...

SRH vs RCB | IPL 2026: హైదరాబాద్ భారీ లక్ష్యం.. పవర్‌ప్లేలోనే ఆర్సీబీ కీలక వికెట్లు డౌన్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH vs RCB | రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో...

NIMS Kidney Transplants | కిడ్నీ ట్రాన్స్​ప్లాంట్స్​లో నిమ్స్​ అరుదైన రికార్డు.. 2K మైలురాయి పూర్తి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: NIMS Kidney Transplants | కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్స్...

SBI Employees Candle Rally | ఎస్​బీఐ ఉద్యోగుల క్యాండిల్​ ర్యాలీ..

​అక్షరటుడే, ఇందూరు: SBI Employees Candle Rally | స్టేట్ బ్యాంక్​...