Bhagirath POCSO Case | బండి భగీరథ్ కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Bhagirath POCSO Case |బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో రిమాండ్‌లో ఉన్న బండి భగీరథ్ పోలీస్ కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించేందుకు అనుమతించాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను మల్కాజ్‌గిరి పోక్సో (POCSO ) ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది.

Bhagirath POCSO Case | తదుపరి విచారణ 26కు వాయిదా..

ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు, ఆధారాలు సేకరించాల్సి ఉన్నందున నిందితుడిని పోలీస్ కస్టడీకి అప్పగించాలని విచారణాధికారులు న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలను విన్న కోర్టు.. తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ రోజున పోలీసుల కస్టడీ పిటిషన్‌పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

Bhagirath POCSO Case | కేసు నేపథ్యం ఇదే..

గతంలో బండి భగీరథ్ ఒక బాలికను లైంగికంగా వేధించారనే ఆరోపణలు వచ్చాయి. బాధితురాలికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు కూడా ఫిర్యాదు అందింది. బాధితురాలి కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు.. ‘పోక్సో’ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలతో పాటు సోషల్ మీడియాలోనూ తీవ్ర సంచలనంగా మారింది. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు భగీరథ్‌ను అరెస్ట్ చేయగా, కోర్టు అతనికి రిమాండ్ విధించింది. ప్రస్తుతం దర్యాప్తును మరింత వేగవంతం చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Cockroach Janata Party| కాక్రోచ్ జనతా పార్టీ’ క్రేజ్.. 2 కోట్లు దాటిన ఫాలోవర్లు!

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *