Congress SC Cell | కాంగ్రెస్​ ఎస్సీ సెల్ జిల్లా​ కార్యవర్గం రద్దు..

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​అర్బన్​: Congress SC Cell | కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా కార్యవర్గం రద్దయిందని నగర కార్పొరేషన్ (Nizamabad Congress) డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ (Bobbili Ramakrishna) పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.

Congress SC Cell | రాష్ట్ర అధ్యక్షుడు సూచన మేరకు..

రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు జిల్లా కార్యవర్గాన్ని రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే జిల్లా అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందన్నారు. ఇందుకుగాను జిల్లాల వారీగా పరిశీలకులను నియమించారని ఆయన తెలిపారు. నిజామాబాద్(Nizamabad) జిల్లాకు పరిశీలకుడిగా చుక్క శ్రీనివాస్​ను నియమించారని వివరించారు. ఆశావహులైన దళిత నాయకులు(Dalit Leaders) తమ బయోడేటాను కాంగ్రెస్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. త్వరలో జిల్లా కమిటీలను ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

ఇది కూడా చదవండి: Bandhi Sanjay Case | ప్రధాని మోడీ ప్రోగ్రాం నుంచి బండి పేరు తొలగింపు.. మెడకు చుట్టుకున్న కొడుకు కీచక వ్యవహారం!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *