అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Illegal Constructions | నగరంలోని (Nizamabad) 8వ డివిజన్లో అక్రమ నిర్మాణాలను, కబ్జాలను అరికట్టాలని డివిజన్ కార్పొరేటర్ మఠం పవన్ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని ప్రజావాణిలో మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్‌కు (Nizamabad Municipal Corporation) వినతిపత్రం అందజేశారు.
Illegal Constructions | దర్జాగా మున్సిపల్ నిబంధనల ఉల్లంఘన..
ఈ సందర్భంగా కార్పొరేటర్ మఠం పవన్ మాట్లాడుతూ.. డివిజన్లోని పలు కాలనీల్లో అక్రమ నిర్మాణాలు, రోడ్ల కబ్జా, మున్సిపల్ నిబంధనల ఉల్లంఘన దర్జాగా సాగుతోందని మఠం పవన్ వివరించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరుగుతోందని ఆరోపించారు. కొంతమంది బిల్డర్లు, భూకబ్జాదారులు ప్రభుత్వ భూములు, రోడ్లను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. ప్రత్యేకించి రోడ్లపై ర్యాంప్‌లు వేయడం వల్ల ప్రజలు రోడ్లపై నడవడానికి కూడా వీలులేకుండా పోయిందని పేర్కొన్నారు.
Illegal Constructions | కబ్జాలతో నిలిచిపోతున్న మురికినీరు
కబ్జాల కారణంగా వర్షాకాలంలో వర్షం, మురికి నీరు వెళ్లడానికి ఎలాంటి దారి లేకుండా పోయిందని కార్పొరేటర్ ఆరోపించారు. ఫలితంగా డివిజన్లోని ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. దోమలు, అనారోగ్య సమస్యలు కూడా పెరిగిపోతున్నాయని తెలిపారు. బిల్డర్లు ప్లానింగ్ ఒకలాగా ఇచ్చి.. తర్వాత క్షేత్రస్థాయిలో మాత్రం ఆలా నిర్మాణాలు చేయట్లేదని పేర్కొన్నారు. అధికారులు నామమాత్రంగా నోటీసులు ఇవ్వడం తప్ప, క్షేత్రస్థాయిలో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.