Yellareddy Development | ఎల్లారెడ్డి అభివృద్ధికి కృషిచేయాలి: ఎమ్మెల్యే మదన్ మోహన్

ఎల్లారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ కోరారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy Development | ఎల్లారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) కోరారు. ఈ మేరకు సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందజేశారు.

Yellareddy Development | పెండింగ్​ బిల్లులు.. విద్యుత్​ సబ్​స్టేషన్లు

పెండింగ్ బిల్లుల విడుదల, 13 నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ల మంజూరు కోసం డిప్యటీ సీఎంకు విన్నవించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నెలకొన్న లో వోల్టేజ్ సమస్యలు, విద్యుత్ అవసరాల కారణంగా 13 నూతన సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అదే సమయంలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను త్వరితగతిన విడుదల చేయాలని కోరారు.

Yellareddy Development | నూతన సబ్‌స్టేషన్ల ప్రతిపాదిత ప్రాంతాలివే..

గోలి లింగాల గేట్ (నాగిరెడ్డిపేట్), గిద్ద (రామారెడ్డి మండలం), వెల్లుట్ల (ఎల్లారెడ్డి మండలం), సోమార్​పేట్​ (ఎల్లారెడ్డి), దుర్గం, గౌరారం కలాన్, గుర్జాల్ (గాంధారి), ధర్మారావుపేట్, కుప్రియాల్, తిమ్మోజీవాడి, లింగంపల్లి (సదాశివనగర్), మెంగారం, లింగంపల్లి ఖుర్ద్ (లింగంపేట్) ఉన్నాయి. అయితే ఎమ్మెల్యే మదన్ మోహన్ అందించిన వినతి పత్రంపై ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. పెండింగ్ బిల్లుల విడుదలతో పాటు 13 నూతన సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించి, త్వరలోనే అవసరమైన చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, అభివృద్ధి పనులకు నిధులు సాధించేందుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ చేస్తున్న నిరంతర కృషిపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: BJP Protest | డీసీసీ కార్యాలయం ఎదుట బీజేవైఎం ‘వందేమాతరం’ గీతాలాపన..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *