అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: GGH Workers Protest | నగరంలోని జిల్లా జనరల్ ఆస్పత్రి (District General Hospital)లో గురువారం తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (AITUC) ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం సూపరింటెండెంట్ రాములుకు వినతిపత్రం అందజేశారు.
GGH Workers Protest | వేతనాలు పెంచకపోవడంతో ఇబ్బందులు
ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓమయ్య, జిల్లా అధ్యక్షుడు పి.సుధాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రి, మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి వేతనాలు పెరగకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దుచేసి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. వెంటనే కార్పొరేషన్ ను ఏర్పాటు చేయడంతో పాటు పీఆర్సీ ప్రకటించి కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి 1000 పడగలకు పెంచాలని, ప్రస్తుతం కార్మికులపై పని భారం పెరుగుతున్నందున కార్మికుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. అర్జీత సెలవులు ఇవ్వాలనే డిమాండ్లతో ఈనెల 9న హైదరాబాద్‌లోని డీఎంఈ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కోశాధికారి భాగ్యలక్ష్మి, నాయకులు రాధా కుమార్, స్వరూప, భారతి, కవిత, వెంకటేష్, శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Kasturba School Inspection | కస్తూర్బాలో వసతులపై కలెక్టర్ ఆగ్రహం..