అక్షరటుడే వెబ్‌డెస్క్: Harish Rao Kalyana Lakshmi | కేసీఆర్ పేరు ఉండకూడదనే దురుద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలపై కుట్ర చేస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వాల పథకాలను కొనసాగించామని, కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చాక వాటిని రద్దు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన రైతు బీమా పథకాన్ని కూడా పక్కన పెట్టేశారని మండిపడ్డారు.
Harish Rao Kalyana Lakshmi | నిషేధిత భూముల జాబితాపై ఆగ్రహం..
1999లోనే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ రద్దు అయినప్పటికీ, ప్రస్తుతం ’22-ఏ’ కింద వేలాది ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరూర్‌నగర్, కొండాపూర్, మాదాపూర్, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లోని భూములను అడ్డగోలుగా ప్రొహిబిషన్‌లో పెట్టారని ఆరోపించారు.
Harish Rao Kalyana Lakshmi | సీఎం ఇల్లే ప్రొహిబిషన్‌లో ఉంది..
అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy ) ఇల్లు కూడా నిషేధిత జాబితాలోనే ఉందని, తన సమస్య వచ్చేసరికి దానిని తొలగించుకునేందుకు హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం పరిస్థితే ఇలా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని నిలదీశారు. రెవెన్యూ శాఖలో ఏ చిన్న పని జరగాలన్నా 30 శాతం వరకు కమిషన్లు డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు. నిషేధిత భూముల అంశంపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Rare Stone Fraud | రాయికి మహిమలు ఉన్నాయని మోసం.. ఆరుగురి అరెస్ట్