Godavari Ganesh Immersion | గోదావరిలో గణేష్ విగ్రహాల నిమజ్జనంలో అప్రమత్తంగా ఉండాలి

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Godavari Ganesh Immersion | గోదావరిలో (Godavari) గణేష్ విగ్రహాల నిమజ్జనంలో అప్రమత్తంగా ఉండాలని సీపీ సాయిచైతన్య (CP Saichaitanya) పేర్కొన్నారు. నందిపేట్ (Nandipet) మండలం ఉమ్మెడ బ్రిడ్జి వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన బందోబస్తు ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు.

Godavari Ganesh Immersion | భద్రతాచర్యలపై సిబ్బందికి సూచనలు..

ఈ సందర్భంగా గోదావరి నదిలో గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను సీపీ క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా భారీ గణేష్ విగ్రహాలను గోదావరి నీటిలో నిమజ్జనం చేసే సమయంలో నిర్వాహకులు, భక్తులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీస్ కమిషనర్ సూచించారు. భారీ విగ్రహాల నిమజ్జనం సమయంలో ఎవరూ ప్రమాదకరంగా నీటిలోకి వెళ్లకుండా చూడాలని, పోలీస్ సిబ్బంది సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. నిమజ్జన ప్రాంతంలో భక్తుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Godavari Ganesh Immersion | రాకపోకలు.. పార్కింగ్​పై అవగాహన..

అదేవిధంగా నిమజ్జనానికి వచ్చే వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, ప్రజల భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి సూచనలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా పోలీస్ శాఖకు ప్రజలు, గణేష్ మండపాల నిర్వాహకులు సహకరించాలని కోరారు. ఈ సందర్భంలో భారీ వినాయకుల నిమజ్జనం కోసం భారీ క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదనపు డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాష్, సీటీసీ ఏసీపీ రాజశేఖర్, ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి, నందిపేట్ ఎస్సై వినయ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: బాక్సాఫీస్పై నాని దండయాత్ర..‘ప్యారడైజ్’కు ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *