అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: Nizamabad Red Cross Counting | జిల్లా (Nizamabad) రెడ్‌క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా కొనసాగుతోంది. నగరంంలోని హరిచరణ్ మార్వాడీ విద్యాలయంలో ఆదివారం ఉదయం ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3గంటలకు ముగిసింది.
Nizamabad Red Cross Counting | పోలైన ఓట్లు..1,552
రెడ్‌క్రాస్ సొసైటీలో మొత్తంగా 9,823మందికి ఓటింగ్ అవకాశం ఉండగా.. మధ్యాహ్నం పోలింగ్ సమయం ముగిసేనాటికి 1552 ఓట్లు పోలయ్యాయి. ఈసారి రెడ్‌క్రాస్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. 29మంది అభ్యర్థులు రెండు ప్యానెళ్లుగా విడిపోయి ప్రచారం చేశారు. రాత్రి 8గంటల వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అభ్యర్థులు, వారి మద్దతుదారులు హరిచరణ్ మార్వాడీ విద్యాలయం ఎదుట ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పోలీసులు సైతం బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: దసరా బరిలో 6 సినిమాలు.. విన్నర్ ఎవరో?