అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad Gambling Raid | పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన నగరం (Nizamabad)లోని మూడో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Nizamabad Gambling Raid | దుబ్బా అరుంధతి నగర్లో..
పోలీసులు తెలిపిన ప్రకారం.. నగరంలోని మూడో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబ్బా అరుంధతి నగర్ ప్రాంతంలో పేకాట ఆడుతున్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.14,100 నగదు, 6 మొబైల్ ఫోన్లు, 2 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Induru to Sabarimala Yatra | శబరిమల పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే ధన్పాల్