Anganwadi Jobs | నిరుద్యోగ మహిళలకు గుడ్​న్యూస్​.. అంగన్​వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

కామారెడ్డి జిల్లాలో అంగన్​ వాడీ పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్​ విడుదల చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Anganwadi Jobs | కామారెడ్డి (Kamareddy) జిల్లాలో అంగన్​ వాడీ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ మేరకు నోటిఫికేషన్​ విడుదల చేసినట్లు జిల్లా సంక్షేమ అధికారి ప్రసన్న ఒక ప్రకటనలో తెలిపారు.

Anganwadi Jobs | జిల్లావ్యాప్తంగా 190 పోస్టులు..

మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల శాఖ పరిధిలోని బాన్సువాడ (Banswada), దోమకొండ (Domakonda), కామారెడ్డి, మద్నూర్, ఎల్లారెడ్డి ఐసీడీఎస్ ప్రాజెక్టులతో పాటు గిరిజన ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న అంగన్​వాడీ టీచర్, సహాయకురాలి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లాలో మొత్తం 190 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో అంగన్​వాడీ టీచర్ పోస్టులు 95, అంగన్​వాడీ సహాయకురాలి పోస్టులు 95 ఉన్నాయి. బాన్సువాడలో 46, దోమకొండలో 41, కామారెడ్డిలో 26, మద్నూర్ లో 35, ఎల్లారెడ్డిలో 42 పోస్టులు ఉన్నాయి. అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు  అధికారణి తెలిపారు.

Anganwadi Jobs | జూలై 9 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..

దరఖాస్తు ప్రక్రియ జూలై 9 నుంచి ప్రారంభమై జూలై 25 సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని ఆమె తెలిపారు. దరఖాస్తులు http://wdcw.tg.nic.in వెబ్ సైట్ ద్వారా మాత్రమే స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలని, హెల్పర్ పోస్టులకు 10వ తరగతి అర్హత సరిపోతుందని తెలిపారు. జూలై 1, 2026 నాటికి వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత అంగన్వాడీ కేంద్రానికి స్థానిక నివాసితులై ఉండాలన్నారు. ఎంపిక ప్రక్రియలో ఇంటర్మీడియట్ మార్కులకు 70, ప్రత్యేక కేటగిరీలకు 20, ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయించారని, ఎంపికైన అభ్యర్థులు జూలై 28 నుంచి ఆగస్టు 1 వరకు సంబంధిత ప్రాజెక్టు కార్యాలయంలో ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఈ నోటిఫికేషన్ రద్దు చేయడం లేదా మార్పుల అధికారం జిల్లా కలెక్టర్ కు ఉంటుందని పేర్కొన్నారు.

Kamareddy

ఇది కూడా చదవండి:  ఢిల్లీలో కుప్పకూలిన భవనం.. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *