Rahul Gandhi Defamation Case | పరువు నష్టం కేసులో రాహుల్​ గాంధీకి ఊరట

పరువు నష్టం కేసులో లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీకి కోర్టులో ఊరట లభించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rahul Gandhi Defamation Case | పరువు నష్టం కేసులో లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీకి కోర్టులో ఊరట లభించింది. యూపీలోని సుల్తాన్‌పూర్ కోర్టు సోమవారం రాహుల్ గాంధీని నిర్దోషిగా ప్రకటించింది.

రాహుల్​ గాంధీ 2018లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)ను హత్య కేసులో నిందితుడిగా పేర్కొంటూ వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులోని ఓ మీటింగ్​లో మాట్లాడుతూ.. బీజేపీ అధ్యక్షుడు ఒక హత్య కేసులో నిందితుడనే విషయాన్ని ప్రజలు మర్చిపోతున్నారన్నారు. నిజాయితీ, మర్యాదల గురించి మాట్లాడే పార్టీకి, హత్య కేసులో నిందితుడైన వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కాగా ఈ కేసులో అమిత్​ షాను 2014లోనే కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. రాహుల్​ వ్యాఖ్యలపై బీజేపీ నాయకుడు వినయ్ మిశ్రా 2018లో పరువు నష్టం దావా వేశారు.

Rahul Gandhi Defamation Case | స్వయంగా హాజరైన రాహుల్

ఏళ్ల విచారణ అనంతరం సోమవారం సుల్తాన్​పూర్​ కోర్టు ఈ కేసు తీర్పు వెలువరించింది. ఈ సమయంలో రాహుల్​ గాంధీ స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేవి కావని కోర్టు పేర్కొంది. దీంతో కేసు నుంచి ఆయన బయట పడ్డారు. అయితే ఈ కేసు విచారణకు వచ్చే సమయంలో ఆయన కాన్వాయ్​లోని కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఐదు కార్లు, ఒక అంబులెన్స్​ ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో భద్రతా సిబ్బంది, నాయకులు గాయపడగా.. రాహుల్ సురక్షితంగా బయట పడ్డారు.

ఇది కూడా చదవండి..: North Block Fire | పార్లమెంట్‌ సమీపంలో అగ్నిప్రమాదం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *