Prakasam Minor Girl Murder | ప్రకాశం జిల్లాలో దారుణం.. ఆరేళ్ల బాలికపై హత్యాచారం

ప్రకాశం జిల్లాలో ఓ వ్యక్తి ఆరేళ్ల బాలికపై హత్యాచారం చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Prakasam Minor Girl Murder | ఏపీలోని ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఇంటి ముందు నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను హత్య చేశాడు.

ప్రకాశం జిల్లా (Prakasam District) నాగులుప్పలపాడు మండలంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆపై ఆమెను హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక తల్లిదండ్రులు బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్​కు వలస వెళ్లారు. అక్కడ దినసరీ కూలీలుగా పని చేస్తున్నారు. బాలిక తన అమ్మమ్మ వద్ద ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఆమె ఇంటి ముందు నిద్రిస్తుండగా.. అదే కాలనీకి చెందిన ఆనంద్ అనే వ్యక్తి ఆమెను ఎత్తుకెళ్లాడు. బాలికపై అత్యాచారం చేసి, హత్య చేశాడు. అనంతరం, మృతదేహాన్ని ఇంట్లోని ఒక కుర్చీపై ఉంచి పారిపోయాడు.

Prakasam Minor Girl Murder | నిందితుడికి దేహశుద్ధి

బాలిక మృతితో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యాచారం విషయం తెలియడంతో కోపంతో నిందితుడి కోసం గాలించారు. అతడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాలిక మృతదేహాన్ని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Arnab Cyclone | దూసుకొస్తున్న అర్నబ్​ తుపాన్​..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *