Anantapur Honey Trap | హ‌నీట్రాప్ దందా.. ఇద్దరు సీఐలపై వేటు

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్: Anantapur Honey Trap | అనంతపురం జిల్లా (Anantapur District)లో కలకలం సృష్టించిన హనీట్రాప్​ దందాలో ఇద్దరు సీఐలపై వేటు పడింది. ఈ దందాలో వారు కీలకంగా వ్యవహరించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఇద్దరిని వీఆర్​కు అటాచ్​ చేశారు.

అనంతపురంలో కొందరు ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఈ ముఠాకు రంగమ్మ అనే మహిళ లీడర్​గా వ్యవహరించేది. వీరు సమాజంలో గౌరవంగా జీవిస్తున్న ధనవంతులను టార్గెట్​ చేస్తారు. కొందరు మహిళలు వారితో చాటింగ్​ చేస్తారు. అనంతరం పరిచయం పెంచుకుంటారు. తర్వాత ఇంటికి పిలుస్తారు. ఇద్దరు కలిసి గడుపుతున్న సమయంలో ముఠా సభ్యులు రంగ ప్రవేశం చేస్తారు. ఆ సమయానికి బాధితుడు న్యూడ్​గా ఉండేలా చేస్తారు. ఆ ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్​ మెయిల్ చేస్తారు. డబ్బులు ఇవ్వకపోతే వీడియోలు సోషల్ మీడియా (Social Media)లో పెడుతామని బెదిరింపులకు పాల్పడుతారు.

Anantapur Honey Trap | రూ.2 కోట్లు వసూలు

ఈ ముఠా పలువురి నుంచి ఇప్పటి వరకు రూ.2 కోట్ల వరకు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దందా వెలుగులోకి రావడంతో కఠిన చర్యలు చేపట్టేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. అయితే నిందితులకు పలువురు పోలీసులు సైతం సహకరిస్తున్నట్లు గుర్తించారు. ప్రధాన నిందితురాలు లేడిడాన్​ రంగమ్మను అరెస్ట్ చేశారు. మరో 10 మందిని విచారిస్తున్నారు. ఎస్పీ జగదీష్​ (SP Jagadeesh)ను కలిసి పలువురు బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. పరువు పోతుందని మరికొందరు సైలెంట్​గా ఉంటున్నారు. రాప్తాడు సీఐ శ్రీహర్షకు ఈ ముఠాతో సంబంధాలు ఉన్నాయి. అలాగే బాధితులు ఫిర్యాదు చేస్తే అనంతపురం త్రీటౌన్‌ సీఐ రాజేంద్రనాథ్‌ యాదవ్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో వీరిద్దరినీ వీఆర్‌కు అటాచ్​ చేశారు. ఈ కేసులో 10 మంది పోలీసులను సస్పెండ్​ చేసే అవకాశం ఉందని సమాచారం.

ఇది కూడా చదవండి..: Anantapur honey trap | హనీట్రాప్ కలకలం.. ఉచ్చులో రియల్టర్, జ్యోతిష్యుడు

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *