ఆంధ్రప్రదేశ్​Visakha Express Assault | విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం.. మాయ‌మాట‌లు చెప్పి ఏసీ బోగీలోకి తీసుకెళ్లి...

Visakha Express Assault | విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం.. మాయ‌మాట‌లు చెప్పి ఏసీ బోగీలోకి తీసుకెళ్లి అత్యాచారం

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న వివాహితకు మాయమాటలు చెప్పి ఏసీ బోగీలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Visakha Express Assault | విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో మహిళపై జరిగిన అత్యాచార ఘటన ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) సంచలనంగా మారింది. ఆదివారం  రోజు ఈ ఘటన చోటుచేసుకోగా.. బాధితురాలు మంగళవారం ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా (Palnadu District) రెంటచింతల ప్రాంతానికి చెందిన దంపతులు ఉపాధి నిమిత్తం విశాఖపట్నంలో నివసిస్తున్నారు. ఈ నెల 26న సాయంత్రం, వివాహిత తన స్వగ్రామానికి వెళ్లేందుకు విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరింది. జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న ఆమెను గుర్తుతెలియని వ్యక్తి పలకరించి, మాయమాటలు చెప్పినట్లు సమాచారం.

Visakha Express Assault | సీరియ‌స్‌గా తీసుకున్న పోలీసులు..

జనరల్ బోగీలో రద్దీగా ఉందని, ఏసీ బోగీలో (AC Coach) ఖాళీ ఉందని చెప్పి ఆమెను అక్కడికి తీసుకెళ్లిన నిందితుడు, అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనా సమయంలో బాధితురాలి భర్త కూడా రైలులో ఉన్నాడా? లేక వేరే బోగీలో ఉన్నాడా? అనే విషయాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఈ దారుణం అనంతరం బాధితురాలు భయాందోళనకు గురై వెంటనే ఫిర్యాదు చేయలేకపోయినట్లు తెలుస్తోంది. మంగళవారం రెంటచింతల పోలీస్ స్టేషన్‌లో (Police Station) ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన బయటపడింది. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం మాచర్లకు తరలించారు.

Visakha Express Assault | ప్రయాణికుల భద్రతపై ఆందోళన

కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు  నిందితుడి గుర్తింపునకు చర్యలు చేపట్టారు. రైల్వే సీసీటీవీ ఫుటేజీలు (Railway CCTV Footage), ప్రయాణికుల వివరాలు సేకరిస్తూ విచారణ కొనసాగిస్తున్నారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. రైలులో ప్రయాణికుల భద్రతపై ఈ ఘటన మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. ముఖ్యంగా మహిళల భద్రత కోసం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

ఇది కూడా చదవండి..: High Speed Diamond | బుల్లెట్ రైళ్లతో నవశకం.. ‘హైస్పీడ్ డైమండ్’తో మారనున్న కనెక్టివిటీ:అశ్వినీ వైష్ణవ్

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....