Madras High Court | ఆ ఉద్యోగాలు చెల్లవు.. విజయ్ సర్కార్‌కు మద్రాస్ హైకోర్టులో బిగ్ షాక్

తమిళనాడులోని విజయ్ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Madras High Court | తమిళనాడులోని విజయ్ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కరూర్ తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు చెల్లవని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రాజ్యాంగ పరిమితులకు లోబడి ప్రభుత్వం వ్యవహరించాలని, ప్రభుత్వ చర్యలపై నియంత్రణ లేకపోతే అరాచకం, అశాంతి రాజ్యమేలుతాయని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ ఉద్యోగం అనేది ఉచితంగా పంచిపెట్టేది కాదని, దానికోసం ఎంతోమంది నిరుద్యోగులు కష్టపడి ఎదురుచూస్తున్నారని న్యాయస్థానం పేర్కొంది.

Madras High Court | ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని..

గత సంవత్సరం సెప్టెంబర్‌లో టీవీకే (TVK) పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో బాధితుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని విజయ్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కరూర్ వెళ్లి, అర్హత ఉన్న 32 మందికి వివిధ ప్రభుత్వ శాఖల్లో తాత్కాలిక నియామక పత్రాలను అందజేశారు.

Madras High Court | హైకోర్టును ఆశ్రయించిన అన్నాడీఎంకే..

ఈ నియామకాలపై అన్నాడీఎంకే నేత ఆర్.బి. ఉదయ్‌కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చట్టపరమైన నిబంధనలను పక్కనపెట్టి తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వడం సరికాదని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్షలాది మంది యువత కష్టపడుతున్నారని, ఏ నియామక ప్రక్రియ చేపట్టినా అది తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TNPSC) ద్వారానే జరగాలని కోరారు. ఈ పిటిషన్‌ను విచారించిన మద్రాస్ హైకోర్టు.. సీఎం విజయ్ ప్రభుత్వం ఇచ్చిన ఆ నియామకాలు చెల్లబోవంటూ తుది తీర్పు వెలువరించింది.

ఇది కూడా చదవండి:  Student Breakfast Scheme | విద్యార్థులకు అల్పాహారం పథకాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *