RS Praveen Kumar | హైకోర్టు తీర్పు రేవంత్​రెడ్డికి చెంపపెట్టు : ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​

హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ను తొలగించాలన్న హైకోర్టు తీర్పు సీఎం రేవంత్​ రెడ్డికి చెంపపెట్టు అని ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RS Praveen Kumar | హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ను తొలగించాలన్న హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు బీఆర్​ఎస్​ నాయకుడు ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ తెలిపారు. సీఎం రేవంత్​ రెడ్డికి ఈ తీర్పు చెంపపెట్టులాంటిందన్నారు.

తెలంగాణ భవన్​లో సోమవారం ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పోలీసుల మీద నమ్మకం లేదు, ప్రజల ఆస్తులను కాపాడటానికి భారత సైన్యాన్ని దించాలని న్యాయస్థానం వ్యాఖ్యానించిన రోజే సీఎం రేవంత్​రెడ్డి తెలంగాణను పరిపాలించే నైతిక హక్కును కోల్పోయారన్నారు. ఆయన రాజీనామా ​చేయాలని డిమాండ్​ చేశారు. అధికారులను ఆయన హెచ్చరించారు. ఒక సంస్థ మీద 63 కోర్టు ధిక్కార ఆరోపణలు ఉన్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఆలోచించాలని సూచించారు.

RS Praveen Kumar | వారి ఉచ్చులో పడకండి

సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి రియల్ ఎస్టేట్ ఉచ్చులో పడొద్దని ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ అధికారులకు సూచించారు. అక్రమ ఆదేశాల్ని తిరస్కరించాలన్నారు. అలా చేస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్​ 311 కాపాడుతుందన్నారు. స్వామి భక్తితో నాయకులు చెప్పినట్లు చేస్తే తర్వాత జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు. మీరు జైలుకు పోతే కుటుంబాలు రోడ్డున పడతాయని హెచ్చరించారు. అనుముల-పొంగులేటి-కాంగ్రెస్ పెద్దల కుటుంబాలకు చీమ కూడా కుట్టదని పేర్కొన్నారు. అధికారులను కోర్టుల ముందు పెట్టి వాళ్లు మాత్రం హాయిగా సేదతీరుతారని పేర్కొన్నారు.

RS Praveen Kumar | చర్లపల్లి జైలుకే..

మంచి పోస్టింగ్ ల కోసం అడ్డదారులు తొక్కితే అధికారులు చర్లపల్లి, చంచల్​గూడ జైలుకు పరిమితం అయ్యే అవకాశం ఉందని ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ హెచ్చరించారు. 63 కోర్టు ధిక్కరణ కేసులు హైడ్రా కమిషనర్‌పై ఉండటం కాంగ్రెస్ ప్రభుత్వ క్రూరత్వానికి నిదర్శనం అన్నారు. బీఆర్​ఎస్​ అధికారంలోకి రాగానే హైడ్రాను రద్దు చేస్తామని కేసీఆర్ ప్రకటించారన్నారు. అంతేగాకుండా కాంగ్రెస్, బీజేపీ కుమ్మకై చేసిన భూ కబ్జాలపై విచారణకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.

దీనిని కూడా చదవండి : Student Breakfast Scheme | విద్యార్థులకు అల్పాహారం పథకాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *