అక్షరటుడే వెబ్‌డెస్క్: Nitin Gadkari Deepfake | కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కుటుంబంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఏఐ (AI) డీప్‌ఫేక్ వీడియోలు, తప్పుడు ప్రచారాలపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ న్యాయపోరాటానికి దిగారు. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (E20) పాలసీ నుంచి తమ కుటుంబం అక్రమంగా లబ్ది పొందుతోందంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
Nitin Gadkari Deepfake | హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
ఈ తప్పుడు ప్రచారాలపై దిగ్గజ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన మెటా, గూగుల్, ఎక్స్ (ట్విట్టర్)లతో పాటు పలువురు అజ్ఞాత వ్యక్తులపై పరువు నష్టం దావా వేసేందుకు బాంబే హైకోర్టు సోమవారం ( జులై 27 ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘లెటర్స్ పేటెంట్’ క్లాజ్ XII కింద జస్టిస్ అభయ్ అహుజా ధర్మాసనం ఈ దావాకు అనుమతి మంజూరు చేసింది. తదుపరి విచారణలో అభ్యంతరకర కంటెంట్‌ను తొలగించే అంశంపై కోర్టు విచారించనుంది.
Nitin Gadkari Deepfake | నాకు ఎలాంటి సంబంధం లేదు..
2003లో ప్రారంభమైన ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ (EBP), ఇటీవల అమలులోకి వచ్చిన 20 శాతం ఎథనాల్ మిశ్రమం (E20) వంటి అంశాలన్నీ పూర్తిగా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ పరిధిలోనివని గడ్కరీ స్పష్టం చేశారు. 2014 నుంచి తాను రోడ్డు రవాణా శాఖ మంత్రిగా కొనసాగుతున్నప్పటికీ, ఈ E20 విధాన నిర్ణయాల్లో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా తన కుటుంబం అక్రమ సంపాదన పొందుతోందంటూ ఏఐ డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించి ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తన ప్రతిష్టను దిగజార్చేలా ఉన్న కనీసం 24 పోస్టులను వెంటనే ఇంటర్నెట్ నుంచి తొలగించాలని ఆయన కోరారు. ఈ కేసులో ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖతో పాటు టెలికమ్యూనికేషన్స్ విభాగాన్ని కూడా ప్రతివాదులుగా చేర్చారు.
Nitin Gadkari Deepfake | నిర్మాణాత్మక విమర్శలను స్వాగతిస్తాం..
ప్రజలు తన పనితీరుపై చేసే నిర్మాణాత్మక విమర్శలను తాను ఎప్పుడూ స్వాగతిస్తానని, వాటిని అడ్డుకోవడం తన ఉద్దేశం కాదని గడ్కరీ స్పష్టం చేశారు. కేవలం అసత్య ఆధారాలతో, దురుద్దేశపూర్వకంగా సాగుతున్న ఏఐ డీప్‌ఫేక్ ప్రచారాన్ని నిరోధించడానికే ఈ న్యాయపోరాటం చేస్తున్నట్లు ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.
🔹డీప్‌ఫేక్, ఏఐ ద్వారా సృష్టించిన అసత్యపు కంటెంట్‌ను ఆన్లైన్లో ప్రచారం చేయడంపై మెటా, ఎక్స్, గూగుల్ తో పాటు ఇతర గుర్తుతెలియని వ్యక్తులపై సివిల్ దావా వేయడానికి కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీకి బొంబాయి హైకోర్టు అనుమతి ఇచ్చింది. #BombayHighCourt @nitin_gadkari pic.twitter.com/x24zsfloAf
— AIR News Hyderabad (@airnews_hyd) July 27, 2026
ఇది కూడా చదవండి: RS Praveen Kumar | హైకోర్టు తీర్పు రేవంత్‌రెడ్డికి చెంపపెట్టు : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్