Nandipalli Auto Accident | ఆస్పత్రికి వెళ్తుంటే ఆటో బోల్తా.. యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి: Nandipalli Auto Accident | రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన నడి​పల్లి సమీపంలోని ఆదివారం చోటు చేసుకుంది.

Nandipalli Auto Accident | ఆటో బోల్తా పడడంతో..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నడి​పల్లి తండాకు చెందిన బట్టు అంజి(25) తన తల్లి బట్టు శోభితో కలిసి నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తున్నారు. అయితే మార్గమధ్యంలో ఆటో బోల్తాపడడంతో అంజికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి శోభికి గాయాలయ్యాయి. ఆమెను నగరంలోని (Nizamabad) జీజీహెచ్​కు చికిత్స నిమిత్తం తరలించారు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇది కూడా చదవండి: కేబీఆర్‌ పార్కు ప్రాజెక్టుకు బ్రేక్‌.. రూ.1,090 కోట్ల పనులు రద్దు! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *