Induru Ganesh Shobhayatra | రాష్ట్రంలోనే ప్రత్యేకం.. ఇందూరు వినాయకుడి శోభాయాత్ర

హైదరాబాద్​ తర్వాత ఇందూరులోనే ప్రతిష్టాత్మకంగా వినాయకుడి శోభాయాత్ర కొనసాగుతుందని ఎమ్మెల్యే ధన్​పాల్​ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Induru Ganesh Shobhayatra | రాష్ట్ర రాజధాని తర్వాత ఇందూరులోనే (Nizamabad) అత్యంత ప్రతిష్టాత్మకంగా వినాయకుడి శోభాయాత్ర కొనసాగుతుందని, ఎంతో ఘన చరిత్ర ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని దుబ్బ చౌరస్తాలో శుక్రవారం రథయాత్రను ప్రారంభించారు.

Induru Ganesh Shobhayatra | 21 జతల ఎడ్లతో అంగరంగ వైభవంగా..

ఎమ్మెల్యే మాట్లాడుతూ… స్వాతంత్ర ఉద్యమంలో ఐక్యత కోసం బాలగంగాధర్ తిలక్ ఇచ్చిన పిలుపుమేరకు ఇందూరులోనూ వినాయకుడి రథయాత్ర ప్రారంభించారని గుర్తు చేశారు. 21 జతల ఎడ్లతో అంగరంగ వైభవంగా శోభాయాత్ర నగరంలోని ప్రధాన వీధుల మీదుగా ముందుకు సాగుతుందన్నారు. యువత భక్తిమార్గంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారని, ఇందుకు ఇందూరు యువతే నిదర్శనమన్నారు. వందేళ్లుగా రథం శోభాయాత్ర సాంప్రదాయం కొనసాగుతుందన్నారు. ప్రధానంగా నగరంలోని పలు కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు శోభాయాత్ర ఆధ్యాంతం సేవా కార్యక్రమాలు కొనసాగించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: సీఈసీ రాజీనామా చేయాల్సిందే.. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *