Konda Laxman Bapuji Tribute | తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్​ బాపూజీ కీలక పాత్ర

తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్​ బాపూజీ కీలక పాత్ర పోషించారని మేయర్​ ఉమారాణి పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Konda Laxman Bapuji Tribute | తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్​ బాపూజీ కీలక పాత్ర పోషించారని.. ఆయన సేవలను మరువలేమని మేయర్​ ఉమారాణి పేర్కొన్నారు. నగరంలోని (Nizamabad) హనుమాన్​ జంక్షన్​లో కొండా లక్ష్మణ్​ బాపూజీ విగ్రహానికి నివాళులు అర్పించారు.

Konda Laxman Bapuji Tribute | నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా..

అడిషనల్​ కలెక్టర్​ భుజంగరావుతో కలిసి నివాళులు అర్పించిన మేయర్​ ఉమారాణి అనంతరం మాట్లాడుతూ.. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్య్ర సమరయోధుడు, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ధీరోదత్తుడు అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహనీయుడని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయానికి తన జీవితాన్ని అంకితం చేసిన బాపూజీ ఆదర్శాలను అనుసరించి యువత సమాజ సేవ చేయాలని మేయర్​ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారులు, స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని బాపూజీకి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో చేనేత సంఘం జిల్లా అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి, కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు కూరగాయల రమేష్​ తదితరులు పాల్గొన్నారు.

prahjt

ఇది కూడా చదవండి: ‘ది ప్యారడైజ్’పై కేటీఆర్ ప్రశంసలు 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *