Panduga Sayanna | అధికారికంగా పండుగ సాయన్న జయంతి

పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Panduga Sayanna | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముదిరాజ్ (Mudiraj)​ కులానికి చెందిన పండుగ సాయన్న జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన జయంతి అక్టోబర్​ 22న, డిసెంబర్​ 10న వర్ధంతిని అధికారికంగా నిర్వహించనున్నారు.

Panduga Sayanna | పండుగ సాయన్న ఎవరంటే..

మహబూబ్​ నగర్​ (Mahabub Nagar) జిల్లాలో జన్మించిన పండుగ సాయన్న నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. అంతేగాకుండా దేశ్​ముఖ్​లు, దొరలు, ధనవంతులను దోచుకొని ఆ డబ్బులను పేదలకు పంచిపెట్టాడు. తెలంగాణ రాబిన్​హుడ్​గా పేరుగాంచిన పండుగ సాయన్నను 35 ఏళ్ల వయసులోనే భూస్వాములు కుట్ర పన్ని చంపారు. ఆయన హత్యకు నిరసనగా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఎస్పీ కార్యాలయంపై దాడికి యత్నించగా.. జనాగ్రహాన్ని చూసి ఎస్పీ గుండెపోటుతో చనిపోయాడు. పండుగ సాయన్న చనిపోయాడని పార్టీ చేసుకుంటున్న భూస్వాములను ప్రజలు తగుల బెట్టారు.

Panduga Sayanna | ముదిరాజ్​ల వినతి మేరకు..

ముదిరాజ్​ కులానికి చెందిన పండుగ సాయన్న జయంతి, వర్ధంతి అధికారికంగా నిర్వహించాలని ఆ కుల ప్రతినిధులు ఇటీవల మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)ని కలిశారు. వారి వినతి మేరకు తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాండుగ సాయన్న ముదిరాజ్ జయంతిని ప్రతి ఏటా అక్టోబర్ 22న, వర్ధంతిని డిసెంబర్ 10న రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్లు ఈ కార్యక్రమం నిర్వహించాలి.

దీనిని కూడా చదవండి : Rajampet SI ACB Trap | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
3 Comments