MP Son Arrested | రోడ్డు ప్రమాదం కేసులో ఎంపీ కుమారుడి అరెస్టు

సహోద్యోగి పూజా అశోక్ మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఐటీసీ కోహినూర్ పరిసర ప్రాంతానికి భోజనం తీసుకురావడానికి వెళ్లారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: MP Son Arrested | హైదరాబాద్‌ మాదా madapur పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో జనసేన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్ లింగమనేనిని గురువారం మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజుల క్రితం ఇనార్బిట్ మాల్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 26 ఏళ్ల యువతి మృతి చెందింది.

MP Son Arrested | ఐటీసీ కోహినూర్ ప్రాంతంలో..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 26 ఏళ్ల భారతి ముఖి, ఆమె సహోద్యోగి పూజా అశోక్ మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఐటీసీ కోహినూర్ పరిసర ప్రాంతానికి భోజనం తీసుకురావడానికి వెళ్లారు. తిరిగి ఇనార్బిట్ మాల్ వైపు వస్తుండగా మాల్ ఎదుట భారతి రోడ్డు దాటుతోంది.

MP Son Arrested | పోలీసుల దర్యాప్తు..

అదే సమయంలో వేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆస్టన్ మార్టిన్ కారు భారతి‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయాలై అధిక రక్తస్రావం జరిగింది. వెంటనే అదే కారులో ఆమెను ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

Milad Un Nabi Holiday | మారిన మిలాద్‌-ఉన్‌-నబి సెలవు తేదీ.. అధికారిక ఉత్తర్వులు జారీ

ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా కారు నడుపుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజుష్ లింగమనేనిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, వాహన వేగం, డ్రైవింగ్ తీరుపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *