అక్షరటుడే, వెబ్‌డెస్క్: Aug 21 Horoscope | గ్రహాల గమనం వలన చాలా రాశుల వారికి నేడు (శుక్రవారం, ఆగస్టు 21) మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని రాశుల వారికి ఊహించని ధనలాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు, వ్యాపారంలో సరికొత్త అవకాశాలు లభించనున్నాయి.
ముఖ్యంగా గతంలో నిలిచిపోయిన అప్పులు చేతికి అందడం, వృత్తిపరంగా గుర్తింపు లభించడం వంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. మరికొన్ని రాశుల వారికి మాట్లాడేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు అలాగే కుటుంబ, ఆరోగ్య విషయాల్లో కొంత ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.
Aug 21 Horoscope | రాశుల వారీగా ఫలాలు
మేష రాశి: Aug 21 Horoscope | వ్యాపార ప్రణాళికలు లేదా ఊహాజనిత పెట్టుబడులు (స్పెక్యులేషన్) లాభాలను ఇస్తాయి. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉత్తరప్రత్యుత్తరాలు, ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆఫీసులో మీరు చేసిన మంచి పనులకు తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. బంధువుల వల్ల వైవాహిక జీవితంలో చిన్నపాటి ఇబ్బందులు రావచ్చు.
వృషభ రాశి: Aug 21 Horoscope | బయటకు వెళ్లేముందు పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం శుభ ఫలితాలను ఇస్తుంది. సన్నిహితులు లేదా భాగస్వాములతో జాగ్రత్తగా ఉండండి. విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు పడుతున్న కష్టానికి ఇవాళ మంచి ఫలితం దక్కుతుంది.
మిథున రాశి: Aug 21 Horoscope | స్నేహితులు మీకు పూర్తి మద్దతుగా నిలుస్తూ సంతోషాన్ని అందిస్తారు. గతంలో ఇచ్చిన అప్పులు ఇవాళ చేతికి అందుతాయి. డబ్బు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఒక పెద్దాయనకు సహాయం చేయడం వలన ఆయన దీవెనలు అందుతాయి.
కర్కాటక రాశి: Aug 21 Horoscope | పిల్లల అనారోగ్యం వల్ల వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆఫీసులో ఒక ముక్యమైన వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. మీ సరదా స్వభావం అందరినీ ఆకట్టుకుంటుంది. ఇంట్లో పూజలు, హోమాలు లేదా పవిత్ర కార్యక్రమాలు జరుగుతాయి. ఆఫీసులో ఒక ముఖ్యమైన వ్యక్తిని కలిసే అవకాశం ఉంది.
సింహ రాశి: Aug 21 Horoscope | వృత్తిపరంగా ఆచితూచి అడుగులు వేయడం వల్ల తగిన ప్రతిఫలం లభిస్తుంది. అనుకున్న సమయానికి ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తారు. కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభించడానికి ఇది అనుకూల సమయం. మీ సమయస్ఫూర్తికి మంచి గుర్తింపు, గౌరవం దక్కుతాయి. బంధువుల జోక్యం వల్ల వైవాహిక జీవితంలో చిన్నపాటి అసంతృప్తి రావచ్చు.
కన్యా రాశి: Aug 21 Horoscope | ఆరోగ్య పరంగా కొంత శ్రద్ధ అవసరం. ఇతరుల కోసం ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది. కార్యాలయంలో మంచి ఫలితాల కోసం కష్టపడి పనిచేయాలి. లేదంటే అధికారుల ముందు ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది. జీవితంలో మంచి జరగడానికి ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ మంత్రాన్ని 28 లేదా 108 సార్లు జపించండి.
తులా రాశి: Aug 21 Horoscope | ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారం చేసేవారికి, విద్యార్థులకు ఇవాళ అనుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రుల సలహా విని డబ్బు పొదుపు చేయడం మంచిది. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు రావచ్చు.
వృశ్చిక రాశి: Aug 21 Horoscope | ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. బ్యాంకు లావాదేవీలు, డబ్బు వ్యవహారాలు చేసేటప్పుడు శ్రద్ధ వహించండి. ఆఫీసులో మీ నిబద్ధత, నైపుణ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. బంధువుల సర్ ప్రైజ్ విజిట్ వల్ల మీ ముందస్తు ప్రణాళికలు మారే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి: ఆఫీసులో మీ పని తీరు, నాణ్యత ఎంతో అద్భుతంగా ఉంటాయి. సహోద్యోగుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. సమస్యలను చిరునవ్వుతో ఎదుర్కొంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేదంటే ఉద్యోగానికి, తద్వారా ఆర్థిక స్థితికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.
మకర రాశి: ఇతరులతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు జాగ్రత్త వహించండి. ఆర్థిక సమస్యలు ఎదురైనప్పటికీ, మీ తెలివితేటలతో నష్టాలను లాభాలుగా మార్చుకుంటారు. విదేశీ వ్యాపారంలో ఉన్నవారికి ఆశించిన ఫలితాలు దక్కుతాయి. ఉద్యోగులు తమ ప్రతిభతో ఆకట్టుకుంటారు. సృజనాత్మకత లాభాలను తెచ్చిపెడుతుంది.
Varalakshmi Vratam 2026 | వరలక్ష్మీ వ్రతం.. పూజ విధానం , విశిష్టత ఇదే!
కుంభ రాశి: భవిష్యత్తులో మంచి లాభాలు రావాలంటే దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం మంచిది. ఆఫీసులో ఎదురయ్యే వ్యతిరేకతను ధైర్యం, విచక్షణతో ఎదుర్కోవాలి. మీ ఉత్సాహంతో ఒత్తిడిని అధిగమిస్తారు. వ్యాపార, ఉద్యోగాల్లో పురోగతి కోసం అవసరమైన వారికి ఎర్రటి దుస్తులను దానం చేయండి.
మీన రాశి: ఇవాళ యోగా, ధ్యానంతో ప్రారంభించండి .స్టాక్ మార్కెట్ వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆఫీసులో ప్రతీ విషయంలో మీదే పైచేయి అవుతుంది. పనిపరంగా ఇది చాలా మంచి రోజు, కష్టపడి పనిచేసి అవకాశాలను ఉపయోగించుకోండి.