Vote for Cash Case | సుప్రీంకోర్టులో నేడు ఓటుకు నోటు కేసు విచారణ

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vote for Cash Case | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.

బీఆర్​ఎస్​ హయాంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నామినేటేడ్​ ఎమ్మెల్యే స్టిఫెన్​ సన్​ ఓటు కొనుగోలుకు యత్నించారనే ఆరోపణలపై రేవంత్​రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన గతంలో జైలుకు కూడా వెళ్లారు. ప్రస్తుతం బెయిల్​పై బయట ఉన్నారు.

Vote for Cash Case | మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని..

ఓటుకు నోటు కేసును ఏసీబీ విచారిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రేవంత్​రెడ్డి ప్రస్తుతం సీఎంగా ఉండటంతో.. విచారణ పారదర్శకంగా జరగదని ఓ వ్యక్తి సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించాడు.ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. దీనిపై నేడు మధ్యాహ్నం విచారణ జరగనుంది. అనంతరం సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇతర రాష్ట్రానికి కేసును బదిలీ చేస్తుందా.. లేదా సీబీఐకి అప్పగిస్తుందా.. అనేది చూడాలి. ఈ కేసులో బెయిల్​ ఎత్తివేస్తే రేవంత్​రెడ్డి సీఎం పదవి పోతుందని బీఆర్​ఎస్​ నాయకులు అంటున్నారు.

Vote for Cash Case

ఇది కూడా చదవండి..: Kaleshwaram Case | కాళేశ్వరం కేసు.. కేసీఆర్‌, హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *