అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ishan Kishan Record | ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తోంది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)పై 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది.
ఈ విజయానికి యువ సంచలనం అభిషేక్ శర్మ (Abhishek Sharma) అజేయ శతకం ప్రధాన కారణంగా నిలిచింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన కెప్టెన్ ఇషాన్ కిషన్, ఈ విజయాన్ని విశ్లేషిస్తూ “ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే ఎక్కువగా అభిషేక్ ఇన్నింగ్స్ గురించే చెప్పాలి” అని అన్నారు. చివరి వరకు క్రీజ్‌లో నిలబడి జట్టుకు భారీ స్కోరు అందించిన తీరు ఎంతో గొప్పదని కొనియాడారు.
Ishan Kishan Record | పిచ్ పరిస్థితులపై విశ్లేషణ
అలాగే క్లాసెన్ ఇచ్చిన ఫినిషింగ్ కూడా కీలకమైందని పేర్కొన్నారు. ఈ తరహా పిచ్‌పై 200కి పైగా స్కోరు చేస్తే ప్రత్యర్థి జట్టుకు చేజ్ చేయడం కష్టమవుతుందని వివరించారు. బంతి పాతబడే కొద్దీ పరుగులు తీయడం కష్టం అవుతుందని ఇషాన్ కిషన్ (Ishan Kishan) చెప్పారు. అందుకే జట్టు ప్రతి మ్యాచ్‌ను విడిగా తీసుకుని ఆలోచిస్తుందని, మొదటి రెండు మూడు బంతుల ద్వారా పిచ్ పరిస్థితులను అర్థం చేసుకుని ఆ తర్వాత ఆటను ప్లాన్ చేస్తామని వివరించారు. ముందుగానే నిర్ణయించుకున్న ప్రణాళికతో కాకుండా, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడమే తమ బలం అని అన్నారు.
Ishan Kishan Record | ఫ్రీగా ఆడే వాతావరణం కల్పించడమే తన లక్ష్యం
డ్రెస్సింగ్ రూమ్‌లో గట్టిగా మాట్లాడే కెప్టెన్‌గా తాను ఉండనని, ఆటను ఆనందంగా ఆడాలని మాత్రమే జట్టుకు చెబుతానని ఇషాన్ కిషన్ వెల్లడించారు. ఆటలో ఒత్తిడిని తగ్గించి, ఫ్రీగా ఆడే వాతావరణం కల్పించడమే తన లక్ష్యమని చెప్పారు. మరోవైపు ఇషాన్ కిషాన్ నేతృత్వంలో ఇప్పటి వరకు ఎస్ఆర్‌హెచ్ ఏడు మ్యాచ్‌లు ఆడగా, ఏడింట్లో ఇషాన్ టాస్ ఓడిపోవడం గమనర్హం. అంతేకాదు ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లలోను హైదరాబాద్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ (Captain Axar Patel) మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ, కీలక దశల్లో క్యాచ్‌లు వదిలేయడం, రనౌట్ అవకాశాన్ని కోల్పోవడం జట్టుకు నష్టమైందని అన్నారు.ఆ అవకాశాలు ఉపయోగించుకుని ఉంటే ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేసేవాళ్లం అని పేర్కొన్నారు. బౌలర్లు తమ పని బాగా చేశారని, ఫీల్డింగ్‌లో మాత్రం మెరుగుపడాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఇది కూడా చదవండి..: Abhishek Sharma L celebration | అభిషేక్ శర్మ ‘ఎల్’ సెలబ్రేషన్ రహస్యం ఏంటి.. ఇన్నాళ్లకి రివీల్ చేశాడుగా..!

